Anasuya Bharadwaj Birthday: అనసూయ 38వ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యుల మధ్య అనసూయ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తన బర్త్ డే పార్టీ ఫోటోలు అనసూయ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. భర్త సుశాంక్, ఇద్దరు కొడుకులు, పేరెంట్స్, అత్తింటివారు అనసూయ బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు. అనసూయ స్లీవ్ లెస్ జాకెట్, డిజైనర్ శారీ ధరించి సూపర్ గ్లామరస్ గా తయారయ్యారు. బర్త్ డే వేడుకల ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఫ్యాన్స్ కి ఫ్లైయింగ్ కిస్సులు ఇచ్చిన అనసూయ, భర్తకు టైట్ హగ్ ఇచ్చారు. అనసూయ జన్మదిన వేడుకల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమెకు ఫ్యాన్స్ విషెస్ తెలియజేస్తున్నారు.
1985 మే 15న అనసూయ జన్మించారు. అనసూయ యంగ్ ఏజ్ లోనే వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు. అనసూయ ఎంబీఏ పూర్తి చేశారు. గతంలో ఆమె సినిమా ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేశారు. ఎన్టీఆర్ నాగ మూవీలో అనసూయ కాలేజ్ స్టూడెంట్ గా జూనియర్ ఆర్టిస్ట్ లో ఒకరిగా కనిపించారు. అనంతరం కార్పొరేట్ జాబ్ చేశారు. న్యూస్ యాంకర్ గా కూడా బాధ్యతలు నెరవేర్చారు. 2013లో ప్రయోగాత్మకంగా మొదలెట్టిన జబర్దస్త్ షో యాంకర్ గా ఆమె ఆడిషన్స్ పాల్గొని ఎంపికయ్యారు. దాంతో అనసూయ దశ తిరిగింది.
ఆ షో అనసూయకు విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. పొట్టి బట్టలు ధరించే బోల్డ్ యాంకర్ గా ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఈ క్రమంలో అనేక విమర్శలు ఎదుర్కొంది. స్ట్రాంగ్ ఉమెన్ అయిన అనసూయ తనపై వచ్చే విమర్శలు, ట్రోల్స్ ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. స్టార్ యాంకర్ అయిన అనసూయ నటిగా బిజీ అయ్యారు. దీంతో యాంకరింగ్ వదిలేశారు. గత ఏడాది అనసూయ టెలివిజన్ షోస్ నుండి పూర్తిగా తప్పుకున్నారు. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని వెల్లడించారు.
కెరీర్ సక్సెస్ఫుల్ ట్రాక్ లో పరుగెడుతుండగా అనసూయ వివాదాల్లో తలదూర్చుతున్నారు. విజయ్ దేవరకొండ అంటే అనసూయకు అసలు గిట్టడం లేదు. ఆయన్ని గెలుకుతూ ట్వీట్స్ వేయడం ఆమెకు పరిపాటిగా మారింది. లైగర్ మూవీ ప్లాప్ కావడంపై అనసూయ సెటైర్ వేశారు. అది పెద్ద దుమారం రేపింది. తాజాగా ఖుషి చిత్ర పోస్టర్స్ లో విజయ్ దేవరకొండ పేరు ముందు The విజయ్ దేవరకొండ అని పెట్టారు. దీన్ని అనసూయ తప్పుబట్టారు. పైత్యం బాగా ఎక్కువైందని ఎద్దేవా చేశారు. అనసూయను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆంటీ అంటూ ట్రోల్ చేశారు.