సింగపూర్ లో పుట్టి పెరిగిన, తమిళియన్ గా ఆనంద కణ్ణన్ స్థిరపడ్డారు. మొదట సన్ టీవీ సిరీస్ సింధ్ బాద్ లో నటించి మెప్పించారు. ఆ సిరీస్ తో పిల్లలకు, యూత్ కు ఆయన బాగా దగ్గర అయ్యారు. 48 ఏళ్ల వయసులో క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ కూడా ఆయన పలు షోలలో నవ్వుతూ పాల్గొనడం ఆయన పోరాట పటిమకు నిదర్శనం.
త్వరలోనే ఆయన కోలుకుంటారు అని అందరూ అనుకుంటున్న సమయంలో క్యాన్సర్ మహమ్మారి ముందు పోరాడలేక ఆనంద నిన్న కన్నుమూశారు. వారం క్రితం ఆయన ఆరోగ్యం హఠాత్తుగా తిరగబడింది. దాంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందించారు.
కానీ వైద్యులు కూడా ఆయనను కాపాడలేకపోయారు. ఒక క్రియేటర్ గా, ఒక యాక్టర్ గా దాదాపు 30 ఏళ్ల పాటు తమిళ ప్రేక్షకులను అలరించిన ఆయన ఇక లేరు అని తెలిసి యావత్ తమిళ పరిశ్రమ దిగ్బ్రాంతికి లోనైంది. ఏకేటీ థియేటర్స్ అనే పేరు పెట్టి అనేక వర్క్ షాప్స్ నిర్వహించి వర‍్ధమాన నటులెందరినో ఆయన పైకి తీసుకొచ్చారు.
మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున ఆనంద కణ్ణన్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.