Gam Gam Ganesha : గం గం గణేశా ట్రైలర్ రివ్యూ: గన్ పట్టిన ఆనంద్ దేవరకొండ, పంథా మార్చాడే!

గం గం గణేశా ట్రైలర్ ఆకట్టుకుంది. ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉంది. గం గం గణేశా చిత్రాన్ని దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి తెరకెక్కించాడు.

Written By: NARESH, Updated On : May 20, 2024 9:15 pm

Gam Gam Ganesha Official Trailer

Follow us on

Gam Gam Ganesha : విజయ్ దేవరకొండ హీరోగా సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలో ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ సైతం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అమెరికాలో చేసే ఉద్యోగానికి కూడా ఫుల్స్ స్టాప్ పెట్టి యాక్టింగ్ ని కెరీర్ గా ఎంచుకున్నాడు. దొరసాని ఆయన డెబ్యూ మూవీ. మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం కమర్షియల్ గా ఆడలేదు. రెండో చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్ తో హిట్ అందుకున్నాడు. గత ఏడాది విడుదలైన బేబీ బ్లాక్ బస్టర్. చిన్న చిత్రంగా విడుదలై వంద కోట్ల వసూళ్ల వరకు రాబట్టింది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించాడు.

బేబీ మూవీలో భగ్న ప్రేమికుడు రోల్ చేసిన ఆనంద్ దేవరకొండ ఈసారి పంథా మార్చాడు. గం గం గణేశా అంటూ యాక్షన్ క్రైమ్ డ్రామాతో వస్తున్నాడు. గం గం గణేశా మూవీ మే 31న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ షురూ చేశారు. నేడు ట్రైలర్ విడుదలైంది. రెండున్నర నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

ఓ వినాయకుడు బొమ్మ చుట్టూ ఈ కథ నడుస్తుంది. గతంలో ఆనంద్ దేవరకొండ చిత్రాల్లో ఈ రేంజ్ వైలెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చూడలేదు. ఆనంద్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. జబర్దస్త్ ఇమ్మానియేల్ కి మంచి పాత్ర దక్కింది. హీరో ఫ్రెండ్ గా అతడు కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ తెలుగు 7 ఫేమ్ ప్రిన్స్ యావర్ ఈ చిత్రంలో ఓ కీలక రోల్ చేయడం విశేషం. వెన్నెల కిషోర్ కామెడీ హైలెట్ గా ఉంది.

గం గం గణేశా ట్రైలర్ ఆకట్టుకుంది. ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉంది. గం గం గణేశా చిత్రాన్ని దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి తెరకెక్కించాడు. ప్రగతి శ్రీవాత్సవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. గం గం గణేశా చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. మరి గం గం గణేశా ఆనంద్ దేవరకొండకు ఎలాంటి విజయం సమకూరుస్తుందో చూడాలి.