Anaganaga Oka Raju Vs Bhartha Mahasayulaku Vignapthi: సంక్రాంతి సినిమాల పండుగ మొదలవ్వబోతోంది. ఈ సంవత్సరం ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ‘అనగనగా ఒక రాజు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే రెండు సినిమాల మధ్య పోటీ తీవ్రంగా నడువబోతోంది. ఈ రెండు సినిమాలు ఆల్మోస్ట్ ఫ్యామిలీ, కామెడీ జానర్స్ లో తెరకెక్కుతున్న సినిమాలు కావడం విశేషం…అలాగే రవితేజ, నవీన్ పోలిశెట్టి ఇద్దరు కూడా కామెడీ టైమింగ్ ఉన్నవారే కావడం వల్ల ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ అవుతోంది అనేది తెలియాల్సి ఉంది. ఇక రవితేజ ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేసి చాలా సంవత్సరాలు అవుతోంది. అలాగే ఈ సినిమాలో ఇటు ఫ్యామిలీతో నలిగిపోతూనే అటు కామెడీ చేస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయాలని రవితేజ చూస్తున్నాడు. సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో రవితేజకు ఇప్పుడు తప్పనిసరిగా సక్సెస్ కావాలి. ఒక మంచి సక్సెస్ కొడితేనే రవితేజ కెరీర్ అనేది ముందుకు సాగుతోంది. లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ మరింత డౌన్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి… ఇక అనగనగా ఒక రాజు సినిమా పరిస్థితి కూడా అలాగే ఉంది. నవీన్ పోలిశెట్టి ఎక్కువ సమయం తీసుకుని చాలా తక్కువ సినిమాలు చేసిన కూడా అందులో క్వాలిటీ ఉంటుంది అంటూ విమర్శకుల చేత ప్రశంసలను అందుకుంటున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా చాలా బాగా వచ్చిందని ఇక దీనిని ఫైనల్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ చూసి అందులో ఏమైనా మైనస్ లు ఉన్నాయా అనేది చెక్ చేసి వాటిని ప్లస్ లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా గోదావరి జిల్లాలోని ప్రజలు ఎలా ఉంటారు.
అక్కడ ఒక రాజు ఉంటే ఆయన ఎలాంటి హై ఫై లైఫ్ ని గడుపుతూ ఉంటారు అనే విషయాలను చాలా కామెడీగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. మరి కామెడీ ని పండించడం లో నవీన్ పోలిశెట్టి కి మంచి టైమింగ్ ఉంది. కాబట్టి ఆయన సైతం ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు.
ప్రస్తుతం రవితేజకు నవీన్ పోలిశెట్టి కి మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది.ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ ని సాధిస్తుంది ఎవరు సంక్రాంతి విన్నర్ అవుతారు అనే దాని మీదనే సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇక మిగతా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికి ఈ రెండు సినిమాల మధ్య మంచి పోటీ ఉంది…