Sankranthi Releases 2026: సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు సినిమాల సందడి మొదలవుతుంది. జనవరి 9వ తేదీ నుంచి సంక్రాంతి వరకు వరుసగా సినిమాలు సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. మొదట రాజాసాబ్ సినిమాతో పండగ వాతావరణం నెలకొనబోతోంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ‘మన శంకర వరప్రసాద్’ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జనవరి 13వ తేదీన రవితేజ హీరోగా వస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా వస్తుండడం విశేషం…14వ తేదీన శర్వానంద్ హీరోగా ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా సైతం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇక అదే రోజున నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా సైతం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఈ ఐదు సినిమాలలో రాజాసాబ్, మన శంకర్ వరప్రసాద్ సినిమాల మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి…
ఈ రెండు సినిమాలు సూపర్ సక్సెస్ సాధిస్తాయని ప్రతి ఒక్క ప్రేక్షకుడు వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు. నిజానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు కావడం వల్ల వీటికి పాజిటివ్ టాక్ వచ్చిన కూడా ఈ సినిమాలు ముందుకు సాగే అవకాశం ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలకు మంచి టాక్ వస్తే మాత్రం మిగిలిన మూడు సినిమాలు ప్రేక్షకుల ఆదరణకు నోచుకునే అవకాశాలైతే లేవనే చెప్పాలి.
దానికి తోడుగా వాటికి థియేటర్లో సంఖ్య కూడా తగ్గించే అవకాశాలైతే ఉంటాయి. మొత్తానికైతే రాజాసాబ్, మన శంకర్ వరప్రసాద్ రెండు సినిమాలు ఈ సంక్రాంతి విన్నర్లుగా నిలవబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. మిగతా మూడు సినిమాల పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
నిజానికి ఆ మూడు సినిమాలు కూడా ప్రమోషన్స్ వైజ్ గా చూసుకున్న అవి చాలా వీక్ గా కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అయితే భారీ ఎత్తున చేయడం లేదు. ఇక సినిమా రిలీజ్ కి మరో 10 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటికి కూడా వాళ్ళు ప్రమోషన్స్ చేపట్టకపోవడం ఆ సినిమాలకు మైనస్ గా మారే అవకాశాలైతే ఉన్నాయి…