Anaganaga Oka Raju Director: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అయితే ఆ సినిమా దర్శకుడికి భారీ గుర్తింపైతే వస్తుంది. ఒక సినిమా ఫెయిల్యూర్ అయితే ఆ దర్శకుడిని బండ బూతులు తిడుతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. సంక్రాంతి సినిమాగా వచ్చి మంచి ఆదరణ దక్కించుకుంది. ఇక ఇలాంటి క్రమంలోనే నవీన్ పోలిశెట్టి హీరోగా చేసిన ఈ సినిమా దర్శకుడైన మారి కి మాత్రం ఎలాంటి ఐడెంటిటి రాలేదు. కొత్త దర్శకుడు అయినప్పటికి ఈ సినిమాని చాలా చక్కగా తెరకెక్కించాడు. ఇక నవీన్ పోలిశెట్టి సినిమాకి రైటర్ కి వ్యవహరించడం, ఒక సాంగ్ పాడడం అలాగే హీరోగా నటించడంతో మొత్తం క్రెడిట్ అంతా అతనికే వెళ్ళిపోయింది. దర్శకుడు మారి ఇందులో చేసింది ఏమీ లేదు అన్నట్టుగా సినిమా యూనిట్ సైతం నవీన్ పోలిశెట్టి మీదనే ఫోకస్ చేసి పబ్లిసిటి చేశారు.
అతను చాలా స్పెషల్ గా అయితే కనిపించలేకపోయాడు. ఇక ఏది ఏమైనా దర్శకుడికి ఇవ్వాల్సిన క్రెడిట్ ని నవీన్ పోలిశెట్టి కొట్టేసాడు అంటు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నవీన్ చేసేది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికి మంచి విజయాలను సాధించే సినిమాలను సెలెక్ట్ చేసుకొని మరి ఆయన సినిమాలుగా చేస్తున్నాడు…
అలాంటి నవీన్ పోలిశెట్టి నుంచి వస్తున్న ప్రతి సినిమా విషయంలో ఆయన చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. అందుకే అతనికి మంచి సక్సెసులైతే దక్కుతున్నాయి. కానీ అనగన ఒక రాజు సినిమా విషయంలో డైరెక్టర్ ను పక్కనపెట్టి హీరో క్రెడిట్ కొట్టేయడం అనేది ఎవరికి నచ్చడం లేదు.
వీలైతే అతన్ని జనానికి పరిచయం చేసి ఫంక్షన్స్ లో తన గురించి కొన్ని మాటలు మాట్లాడిస్తే బాగుండేది. నిజానికి ఒక కొత్త దర్శకుడు భారీ సక్సెస్ ని సాధించడం అంటే మామూలు విషయం కాదు… ఏది ఏమైనా కూడా ఇకమీదట రాబోయే సినిమాలతో మంచి విజయాలను సాధిస్తే తనకి గొప్ప లైఫ్ ఉంటుందంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు…