Anaganaga Oka Raju Collection Day 13: నిర్మాతల అత్యుత్సాహం వల్ల కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి, బయ్యర్స్ కి నిర్మాతలకు భారీ రేంజ్ లో లాభాలను రాబట్టినప్పటికీ కూడా జనాల్లో ఫేక్ అనే ముద్ర పడిపోతుంది. ఈమధ్య కాలం లో నిర్మాతలు వచ్చిన కలెక్షన్స్ తో ఎలాంటి సంబంధం లేకుండా, ఇష్టమొచ్చిన లెక్కలతో పోస్టర్లు దిమ్పేస్తున్నాడు. అలాంటి సంఘటనలకు ఈ సంక్రాంతి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) ‘అనగనగా ఒక రాజు'(anaganaga oka raju) చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది. మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడం తో ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది అనేది పచ్చి నిజం. కానీ వారం రోజుల్లో వంద కోట్ల గ్రాస్ ని రాబట్టింది అనే పోస్టర్ లో మాత్రం ఎలాంటి నిజం లేదు.
వారం రోజు కాదు కదా, ఈ సినిమా విడుదలై నేటికి 13 రోజులు పూర్తి చేసుకొని 14 వ రోజు లోకి అడుగుపెట్టింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ మార్కు కి దగ్గర్లో కూడా లేదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ సినిమాకు 13 రోజుల్లో వచ్చింది 82 కోట్ల రూపాయిలు మాత్రమే. 13 వ రోజున ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా 13 రోజులకు తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 34 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 57 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, ఓవర్సీస్ నుండి 8 కోట్ల 56 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 45 కోట్ల 56 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 82 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారిగా చూస్తే నైజాం నుండి 11.74 కోట్లు, సీడెడ్ నుండి 3.86 కోట్లు, ఉత్తరాంధ్ర నుండి 6.77 కోట్లు, ఈస్ట్ గోదావరి నుండి 3.87 కోట్లు, వెస్ట్ గోదావరి నుండి 2.09 కోట్లు, గుంటూరు నుండి 2.41 కోట్లు, కృష్ణా నుండి 1.97 కోట్లు, నెల్లూరు నెల్లూరు నుండి 1.34 కోట్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తమగు 28 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేస్తే 17 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి.