Agra: ప్రేమ ఎప్పుడైనా ఎదుటి వ్యక్తి సౌఖ్యాన్ని కోరుతుంది. ప్రేమలో ఉన్నవారు పరస్పరం గౌరవించుకుంటారు. ప్రియమైన సంభాషణలు సాగిస్తుంటారు. ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదించాలని ప్రణాళికలు రూపొందించుకుంటారు. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడూ అనుమానించదు. ఎదుటి వ్యక్తి కదలికలను గమనించదు.
మీరు చదువుతున్న ఈ కథనంలో అతడు ప్రేమను నటించాడు. ఆమె ఆరాధనను వాడుకున్నాడు. ఆమెతో శారీరక సుఖాన్ని అనుభవించాడు. చివరికి తన ఉద్యోగ నిర్వహణలో భాగంగా వేరే వ్యక్తితో మాట్లాడుతుంటే అనుమానించాడు. మొత్తంగా ఒక ఉన్మాదిలాగా మారిపోయి ఆమెను అంతం చేశాడు. దేశ రాజధానికి దగ్గర్లో ఉన్న ఆగ్రా నగరంలో జరిగిన ఈ ఘోరం సంచలనాన్ని కలిగిస్తోంది.
దేశ రాజధానికి సమీపంలో ఉన్న ఆగ్రానగరంలో యమునా నదిపై ఉన్న ఒక వంతెనకు దగ్గర్లో ముక్కలు ముక్కలుగా చేసిన శవం కనిపించింది. సమీపంలోనే శరీరం నుంచి వేరు చేసిన తల భాగం కనిపించింది. ఈ అవయవాలు ఒక గోనె సంచిలో కుక్కి కనిపించాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి.
ఆగ్రాలోని తేదీ బగీయా ప్రాంతానికి చెందిన మింకీ శర్మ, వినయ్ సింగ్ ప్రేమించుకుంటున్నారు. మింకి ఒక ప్రైవేట్ సంస్థలో మానవ వనరుల విభాగానికి అధిపతిగా పనిచేస్తోంది. అదే సంస్థలో వినయ్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. వయసు పరంగా చూసుకుంటే మింకి వినయ్ కంటే రెండు సంవత్సరాలు పెద్ద. అయినప్పటికీ వినయ్ లో ఆమె ఒక ప్రేమికుడిని చూసింది.
ఈనెల 23న మధ్యాహ్నం ప్రాంతంలో మింకీ ఆఫీస్ కి వెళ్తున్నానని కుటుంబ సభ్యులు చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళింది. సాయంత్రం వరకు కూడా ఆమె తిరిగి రాలేదు. పైగా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇక జనవరి 24న యత్మదుల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వంతెన పై ఒక గోనె సంచిపడి ఉంది. దాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ సంచిని తెరిచి చూడగా అందులో ఒక మృతదేహం కనిపించింది. అది పూర్తిగా నగ్నంగా ఉంది. పైగా ఆ మృతదేహానికి తలలేదు. దీంతో పోలీసులు ఆ శవం ఎవరిది అని తెలుసుకోవడానికి అనేక రకాలుగా దర్యాప్తు జరిపారు.