Anaganaga Teaser: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే అక్కినేని ఫ్యామిలీ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సుమంత్ (Sumanth) వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికి ఆయనకు రావాల్సినంత గుర్తింపైతే రావడం లేదు. సత్యం, గౌరీ, మళ్లీ రావా, సుబ్రహ్మణ్యపురం లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలను చేసిన సుమంత్ ప్రస్తుతం మరోసారి తన లక్కును పరీక్షించుకునే ప్రయత్నమైతే చేస్తున్నాడు… ప్రస్తుతం ‘అనగనగా ‘ (Anaganaga) అనే ఓటిటి ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఒక టీజర్ అయితే గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది… ఈ సినిమాలో ఆయన స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నారనే విషయాన్ని టీజర్ లో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇక పిల్లలకి ఎప్పుడూ తెలుగులోనే కథలను చెబుతూ వాళ్లకు అర్థమయ్యేలా చెబితే వాళ్లే చదువుతారు. అంతే కానీ బట్టి చదువులు వాళ్ళకి ఏ రకంగానూ ఉపయోగపడవు అనే ధోరణి లో ఆయన వైఖరి అయితే ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన నమ్ముకున్న స్ట్రాటజీ సరైనది కాదు పిల్లలు బట్టి కొట్టిన పర్లేదు పాసైతే సరిపోతుంది.
అనుకునే కొంతమంది వ్యక్తులు ఈయన ఎంచుకున్న మార్గం సరైనది కాదని, దానివల్ల పిల్లల పాస్ పర్సంటేజ్ తగ్గుతుందని ప్రూవ్ చేసే ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే తను నమ్ముకున్న రీతిలో ముందుకు సాగుతూ పుస్తకాలలో ఉన్న మ్యాటర్ ను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో అందించి వాళ్ళను పాస్ చేసి తను సక్సెస్ అయ్యాడా లేదా అనేదే సినిమా స్టోరీ గా తెలుస్తోంది.
ఉగాది కానుకగా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కి వస్తున్న ఈ సినిమా సక్సెస్ సాధించే విధంగా కనిపిస్తుంది. ఇక ఎమోషనల్ గా కూడా ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందనే విషయం అర్థమవుతుంది. తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాతో మంచి సక్సెస్ ని సాధించి మరోసారి తనకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక సన్నీ సంజయ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించి సక్సెస్ ని సాధించి తను కూడా స్టార్ డైరెక్టర్ గా మారాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక మైనస్ లా గురించి మాట్లాడాలంటే ఇంతకు ముందు 35 అనే మూవీ కూడా ఇలాంటి కథతోనే వచ్చింది. ఇక పిల్లలకు చదువు వచ్చేలా చెప్పాలి. కానీ బట్టి పట్టించి చదివించకూడదు అనే పాయింట్ ను హైలెట్ చేస్తు ఈ టీజర్ లో కట్ ఇచ్చారు. 35 మూవీ లో కూడా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది…చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ అయితే కానీ 35 మూవీ లానే ఉందా లేదంటే ఇంకేమైనా చేంజ్ ఉందా అనేది…
