https://oktelugu.com/

Chhaava: మరాఠా యోధుడి సినిమా ‘ఛావా’ ను చూసి భావోద్వేగంతో మోడీ.. ఏమన్నారంటే?

ఇటీవల జరిగిన 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వివిధ అంశాల పై మాట్లాడుతూ.. ఈ క్రమంలోనే ఆయన ఛావా చిత్రాన్ని కూడా ప్రశంసించారు.

Written By: , Updated On : February 22, 2025 / 08:03 PM IST
Chhaava

Chhaava

Follow us on

Chhaava: ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రేజీ టాక్ తో దూసుకుపోతున్న సినిమా ఛావా. మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. శంభాజీ మహారాజ్ పాత్రలో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky kaushal) నటించారు. ఆయన భార్య ఏసు భాయి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక(Rashmika mandanna) నటించారు. విడుదల అయిన మొదటి రోజు మొదటి షో నుంచే బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ.. అత్యధిక కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతుంది ఛావా. ముఖ్యంగా హాలిడే, వర్కింగ్ డే అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లన్నీ హౌస్ ఫుల్ గా నడుస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా పై భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఈ సినిమా రేంజ్ మరెక్కడికో వెళ్లిపోయింది.

ఇటీవల జరిగిన 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వివిధ అంశాల పై మాట్లాడుతూ.. ఈ క్రమంలోనే ఆయన ఛావా చిత్రాన్ని కూడా ప్రశంసించారు. “ఛావా చిత్రం ఇప్పుడు ఒక ముఖ్యాంశంగా మారిందని ప్రధాని అన్నారు. దేశానికి గొప్ప దళిత సాహిత్యాన్ని అందించినందుకు మరాఠీ భాషను ఆయన ప్రశంసించారు. గతంలో మహారాష్ట్ర ప్రజలు సైన్స్, ఆయుర్వేదం, లాజికల్, రీజనింగ్ వంటి వాటికి అద్భుతమైన కృషి చేశారని, హిందీ చిత్రాలే కాకుండా మరాఠీ చిత్రాల ప్రమాణాలను పెంచడంలో మహారాష్ట్ర , ముంబై కీలక పాత్ర పోషించాయని ఆయన అన్నారు. ప్రస్తుతం, ఛావా చిత్రంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా, దేశ ప్రధానమంత్రి ఈ చిత్రం గురించి ప్రశంసలు కురిపించడంతో సినిమా క్రేజ్ మరింత పెరిగింది.

ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్లో… ప్రముఖ నిర్మాత దినేష్ విజన్.. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నిర్మించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకూ వరల్డ్ వైడ్ గా రూ.310.50 కోట్లు వసూలు చేసింది. రూ.31 కోట్లతో అద్భుతమైన ఓపెనింగ్ ను సాధించింది. వీకెండ్ లో శనివారం రూ.37కోట్లు, ఆదివారం రూ.48.5 కోట్లు సాధించింది. ఇకపోతే ఈ సినిమాలో ఔరంగజేబు పాత్రలో అక్షయ్ నటించారు.. డయానా పెంటీ, అశుతోష్ రాణా, దివ్య దత్త, వినీత్ కుమార్ సింగ్ తో పాటు పలువురు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కోసం విక్కీ కౌశల్ 100 కిలోల బరువు కూడా పెరిగారని తెలుస్తోంది.