Vijay Jana Nayagan release: విజయ్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో వస్తున్న ‘జన నాయకుడు’ సినిమా అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈరోజు రిలీజ్ అవ్వాల్సింది. కానీ సెన్సార్ బోర్డు నుంచి ఎదురైన ఇబ్బందుల వల్ల సినిమా యూనిట్ కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడింది. మొదటగా సెన్సార్ వాళ్ళు యూబైఏ సర్టిఫికెట్ ఇచ్చారు. దాంతో పాటుగా ఈ సినిమాలో ఉన్న కొన్ని అభ్యంతరకరమైన డైలాగులను తొలగించాలని వాటిని చెప్పి వాటిని మ్యూట్ చేశారు… ఇక వాళ్ళు చెప్పిన కండిషన్లకి లోబడి సినిమా యూనిట్ మరోసారి సెన్సార్ రిపోర్టు కోసం మూవీ ని పంపగా దాంతో వాళ్ళు యూబైఏ సర్టిఫికెట్ మంజూరు చేసే ముందు మూవీ రివ్యూవర్స్ కి సైతం ఒకసారి ఈ సినిమాని చూపించాలి అని చెప్పారు. దాంతో కోపానికి వచ్చిన సినిమా ప్రొడ్యూసర్స్ కోర్టుని ఆశ్రయించారు. ఇక ఇద్దరి వడిపదనలు విన్న తర్వాత సింగిల్ జడ్జ్ ఈ సినిమాకి యూ బై ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని తీర్పునిచ్చాడు. దానికి సెన్సార్ వాళ్ళు తీర్పును పునఃపరిశీలించాలని జడ్జ్ కి సవాల్ విసిరారు…
దాంతో మద్రాస్ హైకోర్టు జడ్జ్ ధర్మాసనం ముందు అత్యవసర విచారణ కోసం రిట్ పిటిషన్ దాఖలు చేసింది… ఇక యూబైఏ సర్టిఫికేట్ ను మంజూరు చేస్తూ సెన్సార్ బోర్డు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని తేల్చి చెప్పింది. దాంతో సినిమా రిలీజ్ కి లైన్ క్లియర్ అయింది.
ప్రస్తుతం జనవరి 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు… సంక్రాంతి రోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది. ఇక విజయ్ తన సినిమా కెరియర్ కి పుల్ స్టాప్ పెడుతున్నాడు కాబట్టి ఇది తన చివరి చిత్రంగా పరిగణించాడు.
దాంతో ఈ సినిమాని చూడడానికి విజయ్ అభిమానులతో పాటు తమిళ్ సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా విజయ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…