సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఈ సాయంత్రం అదిరిపోయే అప్డేట్ అందనుంది. తాజాగా మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారివారి పాట’నుంచి ఈ అప్డేట్ ఇవ్వనున్నట్టు చిత్రం యూనిట్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది.
ఈనెల 31న సాయంత్రం 4.05 గంటలకు ‘ఫస్ట్ నోటీస్’ ఇవ్వబోతున్నట్టు సర్కారి వారి పాట టీం ప్రకటించింది. ఆ బిగ్ అప్డేట్ ఏంటని ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నిన్న ఇప్పటికే దీని గురించి ప్రకటన చేసి చేతిలో బ్యాగుతో ఏడారిలో మహేష్ బాబు ఎక్కడికో వెళుతున్నట్టు చూపించారు. దుబాయ్ ఏడారిలో మండే సూర్యుడి వెలుగులో మహేష్ ముఖం కనిపించకుండా ఓ ఫొటోను రిలీజ్ చేశారు.
ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. ఆ రోజు సర్కారివారి పాట నుంచి ట్రైలర్ ఉంటుందని అంటున్నారు. ఆలోగా ఈరోజు సాయంత్రం ఏం విడుదల చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. గ్లింప్స్ లాంటిదేదైనా ప్లాన్ చేశారా? అన్నది చూడాలి.
ప్రస్తుతం సర్కారి వారి పాట షూటింగ్ హైదరాబాద్ లోనే సాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా హైదరాబాద్ లో ప్రత్యేక సెట్ వేసి ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. సర్కారివారి పాట మూవీ టీంలో కొంతమందికి కరోనా పాజిటివ్ తేలడంతో ఈ సినిమా షూటింగ్ నిలిపేశారు. ఈనెల 12 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. జూలై 31న విడుదల తేదీని ప్రకటిస్తారా? టీజర్ విడుదల చేస్తారా? అన్నది చూడాలి. సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ఇప్పటికే అనుకుంటున్నట్టు తెలిసింది.
The day we've all been waiting for is here!#SVPFirstNotice will take you by storm today at 4:05 PM 💥💥#SarkaruVaariPaata
Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 @GMBents @SVPTheFilm @saregamasouth pic.twitter.com/EAcTlhIfqt
— Guntur Kaaram (@GunturKaaram) July 31, 2021