Saif Ali Khan: నిన్న రాత్రి ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన హత్యాయత్నం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అభిమానులతో పాటు, వివిధ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ సెలెబ్రిటీలు కూడా ఈ అంశంపై స్పందిస్తూ విచారం వ్యక్తం చేసారు. మన టాలీవుడ్ నుండి జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ట్వీట్స్ వేసిన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే ఈ కేసు విషయం లో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులను పట్టుకొని అదుపులోకి తీసుకునేందుకు ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ని నియమించింది. నేడు సైఫ్ అలీ ఖాన్ ఇంటిని దయా నాయక్, ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి పరిశీలించారు. దయా నాయక్ మామూలు పోలీస్ అధికారి కాదు. ఇప్పటి వరకు ఆయన వివిధ ప్రాంతాల్లో ఏకంగా 80 కి పైగా ఎన్కౌంటర్లు చేశాడు. ఆయనపై అనే సినిమాలు కూడా తెరకెక్కాయి.
తెలుగు లో గోపీచంద్ హీరో గా నటించిన ‘గోలీమార్’ చిత్రాన్ని ఈయన జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దయనాయక్ కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి ప్రాంతానికి చెందిన వ్యక్తి. 1995 వ సంవత్సరం లో ఈయనకి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం లభించింది. ఈయన ఉద్యోగం లోకి చేరిన కొత్తల్లోనే ముంబై లో డ్రగ్స్, హత్యలు, దండాలు, హవాలాలు ఇలా ఎన్నో నేరాలు జరుగుతూ ఉండేవి. 1996 వ సంవత్సరం రాజన్ గ్యాంగ్ లో ఇద్దరినీ ఎన్కౌంటర్ చేసి చంపడంతో దయనాయక్ పేరు దేశవ్యాప్తంగా మారు మోగింది. అక్కడి నుండి ఆయన అండర్ వరల్డ్ నెట్ వర్క్ మొత్తాన్ని ఛేదించి ఏకంగా 80 మంది గ్యాంగ్ స్టర్స్ ని కనికరం లేకండా ఎన్కౌంటర్ చేసి చంపేశాడు.
అలాంటి ఆఫీసర్ ని ఈ కేసు కి నియమించారంటే ప్రభుత్వం ఈ ఘటనపై ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక స్టార్ సెలబ్రిటీ ఇంట్లోకి స్వేచ్ఛగా దొంగలు దూరి దాడి చేసే స్థాయికి వచ్చిందంటే మహారాష్ట్ర లో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అని విపక్షాలు విమర్శలు చేస్తున్న ఈ నేపథ్యంలో ఈ కేసు ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఎలా అయినా నిందితులను నిర్దేశించిన సమయంలో పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మరి దయనాయక్ వాళ్ళను ప్రాణాలతో పట్టుకుంటాడా, లేదా ఎన్కౌంటర్ చేసి శవాలను తీసుకొస్తాడా అనేది చూడాలి. ఇకపోతే సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నికడగానే ఉందని లీలావతి హాసిపిటల్ బృందం మీడియా కి తెలిపింది. ఆయన వెన్నులో చిక్కుకున్న కత్తిని తొలగించమని, బ్లడ్ బ్లీడింగ్ కాకుండా ఆపరేషన్ చేశామని, మెడ దగ్గర చాలా తీవ్రమైన గాయాలు అయ్యాయని, అక్కడ ప్లాస్టిక్ సర్జరీ ని చేశామని ఈ సందర్భంగా డాక్టర్లు చెప్పుకొచ్చారు.