https://oktelugu.com/

రాజధాని తరలింపుపై ప్రభుత్వం వెనక్కి?

రాష్ట్రంలో మూడు రాజధానులలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిని విశాఖ తరలించే విషయంలో ప్రభుత్వం ఒక పక్క అనధికారికంగా చర్యలు చేపడుతూనే ఉంది. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారాయి. జూలై నాటికి రాష్ట్రంలో కరోనా కేసులు మూడు రేట్లయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్న నేపథ్యంలో రాజధాని తరలింపు ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. కరోనా తీవ్రత తగ్గితే, అప్పుడు రాజధాని తరలింపుపై ఆలోచన చేస్తామని తిరుపతిలో చెప్పారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 22, 2020 / 12:01 PM IST
    Follow us on


    రాష్ట్రంలో మూడు రాజధానులలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిని విశాఖ తరలించే విషయంలో ప్రభుత్వం ఒక పక్క అనధికారికంగా చర్యలు చేపడుతూనే ఉంది. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారాయి. జూలై నాటికి రాష్ట్రంలో కరోనా కేసులు మూడు రేట్లయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్న నేపథ్యంలో రాజధాని తరలింపు ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. కరోనా తీవ్రత తగ్గితే, అప్పుడు రాజధాని తరలింపుపై ఆలోచన చేస్తామని తిరుపతిలో చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశాన్ని పేర్కొనడంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదన్నారు.

    చిరు-పవన్ ల మధ్య అగ్రతాంబూలమే అడ్డు..!

    తాజాగా అసెంబ్లీలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించి, మండలిలో మాత్రం ఆమోదించుకోలేక పోయిన ప్రభుత్వం చర్య వల్ల మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీలు బాహాబాహికి దిగారు. అంతా అయిపోయిన తరువాత కరోనా వైరస్ తగ్గే వరకు రాజధానిపై మాట్లాడమని మంత్రి చెప్పడం విడ్డురంగా ఉందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. శాసన మండలిలో ప్రవేశపెట్టిన బిల్లు మండలి ఆమోదించక పోయినా 14 రోజుల అనంతరం సాంకేతిక కారణాల చూపి ఆమోదించినట్లుగా భావించి రాజధానిని తరలిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.

    మోడీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా?

    రాష్ట్ర బడ్జెట్ లో ఈ ఏడాది రూ. 600 కోట్లను విశాఖలో రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆర్కియాలజీ నిపుణులతో కలిసి విశాఖ బీచ్ సమీపంలో ఉన్న పలు స్థలాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో తరలింపు ఆగదని అందరూ భావిస్తున్న తరుణంలో పెద్దిరెడ్డి వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. దీంతో ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గిందనే విషయం వెల్లడైంది. ఇది రాజధాని వాసులను, ప్రతిపక్షాల దృష్టి మరల్చేందుకే ఇటువంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందనే వాదనలు లేకపోలేదు. రాజధాని విషయంలో ప్రభుత్వం వ్యూహంలో మార్పు ఉండదు అనేది స్పష్టం అవుతోంది, తరలింపులో న్యాయపరమైన, సాంకేతిక కారణాలతో కొంత వరకూ ఆలస్యం జరగవచ్చని తెలుస్తోంది.

    మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. రాజధాని ప్రాంత రైతులు మంత్రి వ్యాఖ్యలను తప్పు బతుడున్నారు. రాజధాని అమరావతిలోనే ఎప్పటికీ కొనసాగించాలని కోరుతున్నారు. ఇతర పార్టీలు రాజధానిగా అమారావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న విషయం విదితమే.