Homeఎంటర్టైన్మెంట్Balakrishna : భార్య వసుంధరకు నచ్చిన బాలయ్య ఏకైక మూవీ, వంద చిత్రాల్లో అది చాలా...

Balakrishna : భార్య వసుంధరకు నచ్చిన బాలయ్య ఏకైక మూవీ, వంద చిత్రాల్లో అది చాలా ప్రత్యేకం

Balakrishna :  లెజెండ్ ఎన్టీఆర్ నటవారసుడిగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చి స్టార్ అయ్యారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. నటనలో బాలకృష్ణకు ప్రత్యేకమైన శైలి ఉంది. ముఖ్యంగా డైలాగ్ డెలివరీలో కింగ్. బాలయ్య మాస్ డైలాగ్ చెబితే థియేటర్స్ దద్దరిల్లుతాయి. ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలకృష్ణ ప్రస్థానం మొదలైంది. ఎన్టీఆర్ దర్శకత్వం వహించి నటించిన తాతమ్మ కల ఆయన ఫస్ట్ మూవీ. ఇటీవల బాలకృష్ణ 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నాడు. స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవి అతిథిగా హాజరు కావడం విశేషం.

కాగా బాలకృష్ణ నటించిన చిత్రాల్లో ఓ మూవీ ఆయన భార్య వసుంధరకు చాలా చాలా ఇష్టం అట. ఆ మూవీ చెన్నకేశవరెడ్డి. ఫ్యాక్షన్ కథలతో సంచలన విజయాలు నమోదు చేసిన బాలకృష్ణ నుండి వచ్చిన మరొక చిత్రం చెన్నకేశవరెడ్డి. వివి వినాయక్ రెండో చిత్రం ఇది. బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశాడు. తండ్రి కొడుకులుగా ఆయన నటించారు. బాలకృష్ణ భార్య వసుంధరకు చెన్నకేశవరెడ్డి ఫేవరేట్ మూవీ. ఈ విషయాన్ని ఆమె నాకు స్వయంగా చెప్పారని వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి మూవీ షూటింగ్ ని బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా ఫ్యాక్షనిస్ట్ ఫాదర్ రోల్ షూట్ చేస్తున్న సమయంలో బాలకృష్ణలో ఏదో తెలియని ఉత్సాహం కనిపించేది. ఆయన ఇంటికి వచ్చాక కూడా చాలా హుషారుగా కనిపించేవారు. ఆ పాత్ర గురించి నాతో చర్చిస్తూ ఉండేవారు… అని వివి వినాయక్ తో వసుంధర అన్నారట. అందుకే చెన్నకేశవరెడ్డి మూవీ అంటే ఆమెకు ఇష్టం అట.

వివి వినాయక్ రెండో చిత్రం చెన్నకేశవరెడ్డి. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అనంతరం బాక్సాఫీస్ వద్ద పుంజుకున్న చెన్నకేశవరెడ్డి చెప్పుకోదగ్గ విజయం నమోదు చేసింది. శ్రియ శరన్, టబు హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ప్రస్తుతం బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న డాకు మహారాజ్ విడుదల కానుంది. వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ ఈ చిత్రానికి దర్శకుడు. థమన్ సంగీతం అందిస్తున్నారు. డాకు మహారాజ్ ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి.

 

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version