Balakrishna : లెజెండ్ ఎన్టీఆర్ నటవారసుడిగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చి స్టార్ అయ్యారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. నటనలో బాలకృష్ణకు ప్రత్యేకమైన శైలి ఉంది. ముఖ్యంగా డైలాగ్ డెలివరీలో కింగ్. బాలయ్య మాస్ డైలాగ్ చెబితే థియేటర్స్ దద్దరిల్లుతాయి. ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలకృష్ణ ప్రస్థానం మొదలైంది. ఎన్టీఆర్ దర్శకత్వం వహించి నటించిన తాతమ్మ కల ఆయన ఫస్ట్ మూవీ. ఇటీవల బాలకృష్ణ 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నాడు. స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవి అతిథిగా హాజరు కావడం విశేషం.
కాగా బాలకృష్ణ నటించిన చిత్రాల్లో ఓ మూవీ ఆయన భార్య వసుంధరకు చాలా చాలా ఇష్టం అట. ఆ మూవీ చెన్నకేశవరెడ్డి. ఫ్యాక్షన్ కథలతో సంచలన విజయాలు నమోదు చేసిన బాలకృష్ణ నుండి వచ్చిన మరొక చిత్రం చెన్నకేశవరెడ్డి. వివి వినాయక్ రెండో చిత్రం ఇది. బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశాడు. తండ్రి కొడుకులుగా ఆయన నటించారు. బాలకృష్ణ భార్య వసుంధరకు చెన్నకేశవరెడ్డి ఫేవరేట్ మూవీ. ఈ విషయాన్ని ఆమె నాకు స్వయంగా చెప్పారని వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి మూవీ షూటింగ్ ని బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా ఫ్యాక్షనిస్ట్ ఫాదర్ రోల్ షూట్ చేస్తున్న సమయంలో బాలకృష్ణలో ఏదో తెలియని ఉత్సాహం కనిపించేది. ఆయన ఇంటికి వచ్చాక కూడా చాలా హుషారుగా కనిపించేవారు. ఆ పాత్ర గురించి నాతో చర్చిస్తూ ఉండేవారు… అని వివి వినాయక్ తో వసుంధర అన్నారట. అందుకే చెన్నకేశవరెడ్డి మూవీ అంటే ఆమెకు ఇష్టం అట.
వివి వినాయక్ రెండో చిత్రం చెన్నకేశవరెడ్డి. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అనంతరం బాక్సాఫీస్ వద్ద పుంజుకున్న చెన్నకేశవరెడ్డి చెప్పుకోదగ్గ విజయం నమోదు చేసింది. శ్రియ శరన్, టబు హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ప్రస్తుతం బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న డాకు మహారాజ్ విడుదల కానుంది. వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ ఈ చిత్రానికి దర్శకుడు. థమన్ సంగీతం అందిస్తున్నారు. డాకు మహారాజ్ ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి.