https://oktelugu.com/

Bigg Boss 8 Telugu Finale: బిగ్ బాస్ తెలుగు హిస్టరీ లో నిఖిల్ సాధించిన రికార్డ్స్ ఎవరికీ లేవు..టైటిల్ విన్నర్ కి పర్ఫెక్ట్ నిర్వచనం!

ఇన్ని రోజులు ఉన్న ఉత్కంఠ కి నేడు తెర పడింది. బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ గా నిఖిల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా అందుకున్నాడు. నిఖిల్ బిగ్ బాస్ జర్నీ అంత తేలికైనది కాదు. ఎవరికీ సాధ్యం కాదు కూడా.

Written By:
  • Vicky
  • , Updated On : December 15, 2024 / 11:17 PM IST
    Follow us on

    Bigg Boss 8 Finale: ఇన్ని రోజులు ఉన్న ఉత్కంఠ కి నేడు తెర పడింది. బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ గా నిఖిల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా అందుకున్నాడు. నిఖిల్ బిగ్ బాస్ జర్నీ అంత తేలికైనది కాదు. ఎవరికీ సాధ్యం కాదు కూడా. తన తప్పు లేకుండా దారుణమైన నిందలు అనుభవించి, ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగడం అనేది చిన్న విషయం కాదు. అందుకు చాలా దీక్ష, ఏకాగ్రత, పట్టుదల ఉండాలి. నిఖిల్ స్థానం లో మరో కంటెస్టెంట్ ఉండుంటే ఇంత దూరం రావడం అసాధ్యం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఈసారి తెలుగు వెర్సస్ కన్నడ అనే వాదన సోషల్ మీడియా లో వచ్చింది. ఈ వాదన నిఖిల్ ని గెలవనివ్వకుండా చేస్తుందని ఆయన అభిమానులు భయపడ్డారు. కానీ తెలుగు ప్రేక్షకులు కేవలం ఆట తీరు ని మాత్రమే చూస్తారు, ప్రాంతీయ భావాలను అసలు చూడరు అనడానికి నిఖిల్ టైటిల్ గెలవడం ఒక ఉదాహరణ.

    ఇప్పటి వరకు జరిగిన అన్ని బిగ్ బాస్ సీజన్స్ లో నిఖిల్ కి కొన్ని అరుదైన రికార్డ్స్ ఉన్నాయి. వాటిని భవిష్యత్తులో వేరే కంటెస్టెంట్స్ బ్రేక్ చేస్తారా అంటే డౌటే. ఎన్నో టాస్కులు ఆడాడు, 97 శాతం కి పైగా స్ట్రైక్ రేట్ వచ్చింది. నిఖిల్ టాస్కులోకి దూకాడంటే అవతలి కంటెస్టెంట్ భయపడేవాడు. ఆ రేంజ్ లో పులి లాగా ఆడేవాడు. అలా ఎన్నో టాస్కులు గెలిచి బిగ్ బాస్ హిస్టరీ లోనే హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్నోడిలా నిలిచాడు. అంతే కాదు అత్యధిక ప్రైజ్ మనీ ని సంపాదించిన ఏకైక విన్నర్ గా కూడా బిగ్ బాస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఒక్క సీజన్ విన్నర్ కూడా 50 లక్షల రూపాయిలు తీసుకోలేదు. కానీ నిఖిల్ 50 లక్షల మార్కుని దాటి 55 లక్షల రూపాయిల ప్రైజ్ మనీ ని అందుకున్నాడు.

    నిఖిల్ గెలిచినప్పుడు ఆయన తల్లి పడిన ఆనందం చూస్తే మనకి కూడా కళ్ళు చెమర్చాయి. ఎందుకంటే తన కొడుకు క్యారక్టర్ మీద ఒక బ్లాక్ మార్క్ పడింది. జనాలు అతని వైపు నిలుస్తారా లేదా అనే అనుమానం ఆమెలో ఉన్నింది. అంతే కాదు రన్నర్ గా నిల్చిన గౌతమ్ కూడా నిఖిల్ కి ఓటింగ్ లో మామూలు రేంజ్ పోటీని ఇవ్వలేదు. బిగ్ బాస్ హిస్టరీ లో విన్నర్ కి రన్నర్ కి మధ్య ఇంత తక్కువ మార్జిన్ ఉండడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. ఆ భయం కూడా నిఖిల్ వాళ్ళ అమ్మ ముఖం లో కనిపించింది. నిఖిల్ కేవలం టాస్కులు మాత్రమే కాకుండా, క్యారక్టర్ పరంగా కూడా ఉన్నతమైన విలువలు పాటించి బయటకి వచ్చాడు. తదుపరి సీజన్స్ లో నిఖిల్ రేంజ్ కంటెస్టెంట్ ని చూడడం కష్టమే, ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.