https://oktelugu.com/

హాలీవుడ్‌ ఆఫర్ రిజెక్ట్‌ చేసిన హాట్‌ బ్యూటీ

దిశా పటానీ బాలీవుడ్‌ఈ అమ్మాయి ఇప్పుడో సెన్సేషన్. చిట్టి పొట్టి బట్టలతో అందాలను ఆరబోయడంలో ఆమె స్టయిలే వేరు. తన మాజీ ప్రియుడు టైగర్ష్రాఫ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఆమె తన జిమ్‌, వర్కౌట్‌ వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ యువత హార్ట్‌ బీట్‌ పెంచుతుంది. పలు ఈవెంట్స్‌లో హాట్‌ లుక్స్‌తో అదరగొడుతుంది. దాంతో, జాతీయ మీడియా ఆమెకు ‘నేషనల్‌ క్రష్’ అనే బిరుదిచ్చింది. ఉత్తరాఖండ్‌లో పుట్టిన ఈ అమ్మడు తెరంగేట్రం చేసింది టాలీవుడ్‌తోనే. మోడలింగ్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 12, 2020 / 07:18 PM IST
    Follow us on

    దిశా పటానీ బాలీవుడ్‌ఈ అమ్మాయి ఇప్పుడో సెన్సేషన్. చిట్టి పొట్టి బట్టలతో అందాలను ఆరబోయడంలో ఆమె స్టయిలే వేరు. తన మాజీ ప్రియుడు టైగర్ష్రాఫ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఆమె తన జిమ్‌, వర్కౌట్‌ వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ యువత హార్ట్‌ బీట్‌ పెంచుతుంది. పలు ఈవెంట్స్‌లో హాట్‌ లుక్స్‌తో అదరగొడుతుంది. దాంతో, జాతీయ మీడియా ఆమెకు ‘నేషనల్‌ క్రష్’ అనే బిరుదిచ్చింది. ఉత్తరాఖండ్‌లో పుట్టిన ఈ అమ్మడు తెరంగేట్రం చేసింది టాలీవుడ్‌తోనే. మోడలింగ్‌ నుంచి  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ హీరోగా నటించిన ‘లోఫర్’ మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్‌ కాకపోవడంతో బాలీవుడ్‌పై దృష్టి సారించింది. మోడల్‌గా అప్పటికే మంచి పేరు తెచ్చుకోవడంతో నీరజ్‌ పాండే దర్శకత్వంలో దివంగత సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చిత్రం ‘ఎంఎస్‌ ధోనీ’లో నటించే చాన్స్‌ వచ్చింది. అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. తర్వాత ‘కుంగ్ ఫు యోగా’, ‘భాగి 2’, ‘భారత్‌’, ‘మలాంగ్‌’, ‘భాగి 3’ ఇలా వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇప్పుడు అషిమా హిబ్బర్ డైరెక్షన్‌లో ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ‘కెటీనా’ అనే నాయికా ప్రధాన చిత్రంలో నటిస్తోంది. దాంతో పాటు ప్రభుదేవా డైరెక్షన్‌లో సల్మాన్‌ ఖాన్ మూవీ ‘రాధే’ కూడా చేస్తోంది.

    లేట్ వయసులో పర్ఫెక్ట్ ఫిజిక్.. నెటిజన్లు స్టన్ !

    ఇలా తక్కువ టైమ్‌లోనే బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిన దిశాను వెతుక్కుంటూ ఏకంగా హాలీవుడ్ ఆఫర్ వచ్చింది. దీనికి ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, దిశా మాత్రం ఈ ఆఫర్ను ఈజీగా రెజెక్ట్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి ఆమె ఇచ్చిన సమాధానం మరింత ఆసక్తికరంగా ఉంది. ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు.. ఎంత మంది పెద్ద హీరోలతో నటించామన్నదే తనకు ముఖ్యం అని అంటోందామె. ప్రస్తుతం బాలీవుడ్‌లో పెద్ద హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నానని, ఈ టైమ్‌ను హాలీవుడ్‌ సినిమాలకు కేటాయించలేనని స్పష్టం చేసింది. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటోంది. తానేంటో బాలీవుడ్‌ నిరూపించుకోవాల్సింది చాలా ఉందని చెప్పింది. అలా కాకుండా ఇక్కడ చేతి నిండా ఉన్న పనిని వదిలేసి ఎక్కడికో వెళ్లి ఏదో సాదిద్ధాం అనుకునే రకం తాను కాదని చెప్పింది. అందుకే హాలీవుడ్‌ ఆఫర్ను తిరస్కరించానని అంటోందామె.

    ‘రాధేశ్యామ్‌’ రికార్డులు షురూ