
Amit Shah- RRR Team: క్రెడిట్ దక్కే ఏ చిన్న విషయాన్ని పొలిటికల్ పార్టీలు వదులుకోవు. ఆ విషయంలో బీజేపీ ఒక అడుగు ముందే ఉంటుంది. టాప్ స్టార్స్ ని సన్మానించడం ద్వారా వారి అభిమానుల హృదయాల్లో ఎంతో కొంత చోటు సంపాదించుకోవచ్చని వాళ్ళ భావన. బాలీవుడ్ లో చాలా మంది స్టార్స్ బీజేపీకి జై కొడుతున్నారు. కర్ణాటకలో ఎలక్షన్స్ కాగా సుదీప్ వంటి హీరోలను తమవైపు తిప్పుకున్నారు. బహిరంగంగా సుదీప్ తన మద్దతు ప్రకటించేలా ప్రభావితం చేశారు. ఇక తెలుగు రాష్ట్రాలపై గురిపెట్టిన బీజేపీ ఇక్కడి స్టార్స్ తో టచ్ లో ఉంటున్నారు. సందర్భం ఉన్నా లేకున్నా వాళ్ళను కలిసే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్టీఆర్ తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇది నచ్చని బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తున్నాడన్న నెపంతో బ్రహాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చివరి నిమిషంలో పర్మిషన్ రద్దు చేసింది. రామ్ చరణ్ ని కూడా అమిత్ షా కలిశారు. ఆయన్ని అభినందించారు. ఈసారి ఆర్ ఆర్ ఆర్ టీమ్ కి ఏకంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వస్తున్న అమిత్ షా ఆర్ ఆర్ ఆర్ టీమ్ కోసం విందు ఏర్పాటు చేశారట. ఆర్ ఆర్ ఆర్ మూవీ సభ్యులను ఆయన అభినందించానున్నారట. ఇది పొలిటికల్ గైన్ కోసం చేస్తున్న ఈవెంట్ అని రాజకీయ వర్గాల వాదన.
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ బీజేపీ మనిషిగా నిరూపించుకున్నారు. ఆయన్ని రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ ఎంపిక చేసింది. బీజేపీ సానుభూతిపరురాలైన కంగనా రనౌత్ ద్వారా విజయేంద్ర ప్రసాద్ కాషాయ దళానికి దగ్గరయ్యారు. ఆయన ఏకంగా ఆర్ ఎస్ ఎస్ భావజాలం మీద స్క్రిప్ట్ రాశారట. అది ఓ అద్భుతమైన స్క్రిప్ట్ అని రాజమౌళి ఆల్రెడీ ఓ సందర్భంలో ప్రమోట్ చేశారు.

అలాగే ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ వేడుక పేరుతో రూ. 25 లక్షలు ఖర్చుపెట్టి టాలీవుడ్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేదికపై కీరవాణి స్పీచ్ సంచలనమైంది. రామోజీరావు పేరు తెరపైకి ఆయన మహానుభావుడు అన్నారు. ఆయన అభిప్రాయం వెల్లడించడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే సందర్భమే సరైంది కాదు. ఒక ప్రక్క సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న రామోజీరావు మీద రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్న వేళ… ఆర్ ఆర్ ఆర్ తో ఎలాంటి సంబంధం లేని ఆయన్ని తెరపైకి తెచ్చి ప్రాపగాండాకు తెరలేపారు. కీరవాణి వ్యాఖ్యలను ఓ వర్గం తప్పుబట్టింది. పరిణామాలు చూస్తుంటే ఆస్కార్ అవార్డు చుట్టూ రాజకీయ చదరంగం నడుస్తున్నట్లుగా ఉంది.