
Raw Mango Benefits: పచ్చి మామిడికాయను చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. దాన్ని చూస్తే తినేయాలనే ఆశ కలుగుతుంది. అందులో కారం, ఉప్పు కలుపుకుని తింటే ఆ మజా వేరు. స్వర్గం కనిపిస్తుంది. అంతటి రుచిగా ఉంటే పచ్చిమామిడి కాయ తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఆర్, మెగ్నిషియం పుష్కలంగా ఉండటంతో మనకు ఎంతో మేలు కలిగిస్తుంది. తెల్ల రక్తకణాలు పెంచేందుకు దోహదం చేస్తుంది.
రక్తసరఫరా మెరుగుగా చేయడంలో సాయపడుతుంది. రక్తనాళాలు శుభ్రపరచి రక్తపోటును దూరం చేస్తుంది. పాలీ ఫెనాల్స్ కారణంగా క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. ఊపిరితిత్తులు, ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లకు కూడా ఇది ఔషధంలా పనిచేస్తుంది. షుగర్ లెవల్స్ పెరగకుండా దోహదపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో ఐరన్ లోపం లేకుండా చేస్తుంది.
వేసవిలో మన శరీర ఉష్ణోగ్రత పెరగకుండా నిరోధిస్తుంది. వడదెబ్బ తగలకుండా చేస్తుంది. ఉదర సంబంధమైన సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణ సమస్యలు తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పచ్చి మామిి కాయలు కాలేయ సమస్యలను కూడా తగ్గిస్తాయి. చెడ్డ కొవ్వును తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే పచ్చి మామిడికాయలను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఇందులో ఫైబర్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇవి తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల అధిక బరువు సమస్యకు చెక్ పెట్టినట్లు అవుతుంది. పచ్చి మామిడిలో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నందున వీటిని ఈ కాలంలో అధికంగా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ఫలితాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.