spot_img
Homeట్రెండింగ్ న్యూస్Lions: బోను నుంచి తప్పించుకున్న సింహాలు.. పారిపోయిన జనాలు.. వైరల్ వీడియో

Lions: బోను నుంచి తప్పించుకున్న సింహాలు.. పారిపోయిన జనాలు.. వైరల్ వీడియో

Lions
Lions

Lions: సింహాలు చూస్తేనే భయం వేస్తుంది. బోనులో ఉన్నప్పుడు వాటి దగ్గరకు వెళ్లడానికే జంకుతాం. అలాంటిది అవి ఎన్ క్లోజర్ నుంచి తప్పించుకుని మనవైపు వస్తే ఇంకేమైనా ఉందా? మన గుండెలు జారిపోతాయి. సింహాలను చూస్తే మన ప్రాణాలు పైనే పోతాయి. నిజంగా ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంతో వారికి ఏం తోచక పరుగులు పెట్టారు. సింహాల రాకతో ఒక్కసారిగా ఉలిక్కి పడి అక్కడి నుంచి బతుకు జీవుడా అంటూ ప్రాణాలు కాపాడుకున్నారు.

తాజాగా చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లుయోయాంగ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సర్కస్ లో విన్యాసాలు చేసే సింహాలు తప్పించుకోవడంతో జనం చెల్లాచెదురయ్యారు. వాటి గర్జింపుకు బెంబేలెత్తిపోయారు. అంతవరకు సరదాగా సర్కస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు మతి పోయింది. వాటిని చూడగానే భయంతో కేకలు పెడుతూ పరుగులు పెట్టారు.

సర్కస్ లో ఓ రింగ్ లోంచి సింహాలను దూకిస్తున్నారు. అవి మొరాయించడంతో శిక్షకులు వాటిని బలవంతంగా దూకించే ప్రయత్నం చేశారు. ఎన్ క్లోజర్ రెండో వైపు సరిగా లాక్ చేయకపోవడంతో అవి అక్కడ నుంచి బయటకు వచ్చేశాయి. దీంతో వాటిని చూసిన జనం కాళ్లకు పనిచెప్పారు. వాటి భయంతో అందరు వెళ్లిపోయారు. దీనిపై సర్కస్ యాజమాన్యం మాత్రం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

Lions
Lions

ఈ ఘటనతో అందరు నివ్వెరపోయారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. సర్కస్ వాళ్ల లోపం గురించి దర్యాప్తు చేపట్టనున్నారు. జంతుప్రేమికులు సింహాలను వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోరులేని జీవాలను వేధిస్తూ సర్కస్ చేయించడం చట్టవిరుద్ధమంటూ ప్రకటనలు చేస్తున్నారు. దీంతో సర్కస్ ను నిలిపివేశారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version