కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే అంబాజీపేట అనే గ్రామంలో వెంకట్(నితిన్ ప్రసన్న) అనే ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఈయన ఊర్లో ఉన్న జనాలందరికీ అప్పులు ఇస్తూ జనాల దగ్గర వడ్డీని వసూలు చేస్తూ వాళ్ళని హింసిస్తూ ఉంటాడు. ఇలాంటి క్రమంలోనే మల్లి (సుహస్) అనే ఒక వ్యక్తి తన కుల వృత్తిని చేసుకుంటూ అదే జీవనాధారంగా బతుకుతుంటాడు. ఇక మల్లి అక్క అయిన పద్మ (శరణ్య) కూడా స్కూల్లో టీచర్ గా చేస్తూ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే వెంకట్ వాళ్ళ చెల్లె అయిన లక్ష్మి (శివాని నాగరం), మల్లి ఇద్దరు లవ్ చేసుకుంటారు. ఇక డబ్బు, అధికార మధం తో ఉన్న వెంకట్ వీళ్ళ పెళ్లికి అడ్డుపడతాడు.ఆత్మాభిమానం కలిగిన మల్లి, పద్మలు డబ్బు కంటే వాళ్ళకి ఆత్మభిమానాలే ముఖ్యమని నమ్ముతూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలో మల్లి, లక్ష్మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు దుశ్శాంత్ ఈ సినిమాని అద్భుతంగా మలిచాడు.నిజానికి ఈ సినిమా కథ కొత్తదేమీ కానప్పటికీ ఆయన ఎంచుకున్న తీరుగాని, ఆ పాయింట్ ని ఆయన్ ప్రెజెంట్ చేసిన విధానం గాని చాలా బాగున్నాయనే చెప్పాలి. ఇక ఇది ముఖ్యంగా కులాల మధ్య జరిగే వ్యవహారం కంటే కూడా పద్మ అనే క్యారెక్టర్ మీద ఈ సినిమా ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఒక ఆడ మనిషి ఏం చేయగలదు, తన జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి ఎలాంటి సిచువేషన్స్ నైనా ఎలా ఎదిరిస్తుంది అనే పాయింట్ ని సెంటర్ పాయింట్ గా చేసుకుని రాసుకున్న ఈ కథ ప్రేక్షకుడికి ఒక మంచి అనుభూతిని ఇస్తుందనే చెప్పాలి. అయితే ఈ సినిమా మొదట కొంచెం స్లోగా నడిచినప్పటికీ మధ్యలో కొన్ని సీన్లు మాత్రం హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా పద్మ పోలీస్ స్టేషన్ సీన్ లో పోలీస్ లతో మాట్లాడే మాటలు గాని, వాళ్ళతో పెట్టుకునే గొడవలుగాని సినిమా గ్రాఫ్ ని ఒక్కసారి గా పైకి లేపుతుంది. ఈ సినిమాలో సుహాస్ హీరో అనేకంటే పద్మ క్యారెక్టర్ చేసిన శరణ్యనే హీరో అని చెప్పాలి. ఆమెకి యాక్టింగ్ చేయడానికి చాలా స్కొప్ ఉంది.
అలాగే ఈ సినిమా మొత్తాన్ని ఆమె ముందుండి నడిపిస్తుంది. మొత్తానికైతే దర్శకుడు దుష్యంత్ మొదటి ప్రయత్నంలోనే ఒక మంచి అటెంప్ట్ చేసి మంచి గుర్తింపు అయితే క్రియేట్ చేసుకున్నాడనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో చెప్పిన పాయింట్ బాగున్నప్పటికీ సినిమా మాత్రం అక్కడక్కడ కొంచెం డల్ అయిందనే చెప్పాలి. కొత్త దర్శకుడు కావడం వల్ల అనుభవం లేకుండా నడిపించిన ఆ తీరు అనేది మనకు సినిమాలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక కొన్ని సీన్లల్లో అయితే మ్యూజిక్ మాత్రం అద్భుతంగా ఉంది. స్పెషల్ గా ఆర్ఆర్ అయితే ఈ సినిమాకు ప్రాణం పోసిందనే చెప్పాలి…అలాగే ఈ సినిమాలో సుహాస్ కనబరిచిన నటన కూడా చాలా బాగుంది ఆయన నవ్విస్తాడు, ఏడిపిస్తాడు గిలిగింతలు పెడతాడు అన్ని తనే చేస్తాడు.
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్ట్ ల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో నటించిన నటులలో సుహాస్ తనదైన నటనని కనబరిచి మరొకసారి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా మల్లి పాత్ర లో ఒదిగిపోయి దానికి న్యాయం చేశాడనే చెప్పాలి.ఇక తన నటన తో ఈ సినిమాకి ప్రాణం పోశాడు. ఇక శరణ్య యాక్టింగ్ అయితే పీక్స్ అనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఇలాంటి యాక్టింగ్ తో ఈమె ఎప్పుడు మనకి కనిపించలేదు. అసలు ఈమె లో ఇంత మంచి నటి ఉందా అని ప్రతి ఒక్కరు ఉలిక్కిపడేలా నటించి మెప్పించింది… మిగిలిన నటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించి ఓకే అనిపించారు. ముఖ్యంగా విలన్ గా చేసిన నితిన్ ప్రసన్న మాత్రం విలనిజాన్ని పండిస్తూ తన పాత్రతో ప్రేక్షకులను మెప్పించాడు.
టెక్నికల్ విషయాలు
ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే దీనికి మ్యూజిక్ అందించిన శేఖర్ చంద్ర ఒక ఫీల్ గుడ్ మ్యూజిక్ అందించాడనే చెప్పాలి. ఇక ఆర్ఆర్ తో మాత్రం చాలా సీన్లని ఎలివేట్ చేశాడు. శేఖర్ చంద్ర అంటే తను ఇంతకుముందు చేసిన నచ్చావులే, కార్తికేయ లాంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఇక వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాకి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించాడనే చెప్పాలి… ఇక సినిమాటోగ్రాఫర్ అయిన వజిద్ బైగ్ అందించిన విజువల్స్ కూడా ఈ సినిమాకి మరొక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాని విజువల్స్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు. ఇక ఈ సినిమాకి ఎడిటర్ అయిన కోదాటి పవన్ కళ్యాణ్ కూడా సీన్ల మధ్య లాగ్ లేకుండా షార్ప్ ఎడ్జ్ లో కట్ చేస్తూ సినిమా విజయంలో కీలకపాత్ర వహించాడు…
ప్లస్ పాయింట్స్
కథనం
సుహాస్, శరణ్య ల యాక్టింగ్
కొన్ని ఎమోషనల్ సీన్లు
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
అక్కడ అక్కడ కొన్ని సీన్లు స్లో అయ్యాయి.
రేటింగ్
ఇక ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5