https://oktelugu.com/

Cheating In Petro Bunk : పెట్రోల్ బంకుల్లో ఈ మోసం జరుగుతోంది.. జాగ్రత్తగా కనిపెట్టండి..

అయితే పెట్రోల్ కొట్టించుకోవడానికి ప్రతి ఒక్కరూ బంకులకు వెళ్లాల్సిందే. కొన్ని పెట్రోల్ బంకులు న్యాయంగా పెట్రోల్ ను అమ్ముతూ డబ్బులు తీసుకుంటారు. కానీ కొందరు ట్రిక్స్ ప్లే చేసి అదనంగా వసూలు చేస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : February 2, 2024 12:53 pm
    Petrol Bunk cheating

    Petrol Bunk cheating

    Follow us on

    Cheating In Petro Bunk : పెట్రోల్ నేడు నిత్యావసరంగా మారిపోయింది. రోజూవారీ ఆహార పదార్థాల వలె పెట్రోల్ కూడా తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఇంట్లో ఒక వాహనం ఉంటోంది. దీంతో పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేస్తుంటారు. అయితే పెట్రోల్ కొట్టించుకోవడానికి ప్రతి ఒక్కరూ బంకులకు వెళ్లాల్సిందే. కొన్ని పెట్రోల్ బంకులు న్యాయంగా పెట్రోల్ ను అమ్ముతూ డబ్బులు తీసుకుంటారు. కానీ కొందరు ట్రిక్స్ ప్లే చేసి అదనంగా వసూలు చేస్తున్నారు. ఇంకొందరు పెట్రోల్ పోసే మిషన్ లో ఏదో మాయ చేసి తక్కువ పెట్రోల్ పోసి ఎక్కుడ డబ్బులు లాగేసుకుుంటున్నారు. ఇంతకీ ఆ మోసం ఎలా జరుగుతుందంటే?

    వాహనాల వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుండడంతో ప్రతిరోజు పెట్రోల్ బంకులు రద్దీగా ఉంటున్నాయి. కొన్నిప్రత్యేక రోజుల్లో క్యూలో ఉన్నా.. పెట్రోల్ దొరకని పరిస్థితి. దీంతో కొందరు స్పీడ్ గా పెట్రోల్ వచ్చే విధంగా సెట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పెట్రోల్ మీటర్ తొందరగా పూర్తవుతుంది. కానీ వాహనాల్లో మాత్రం ఇంధనం కనిపించదు. ఇలా కొందరు వాహనాల్లో పెట్రోల్ పోసుకున్న కొద్దిదూరం వెళ్లగానే ఆయిపోయిన సంఘటనలు ఉన్నాయి. మరికొందరికి అనుకున్న మైలేజ్ రాకపోవడంతో పెట్రోల్ బంకులను నిలదీశారు.

    అయితే కొన్ని పెట్రోల్ బంకు నిర్వాహకులు చేసే ట్రిక్ ఏంటంటే.. లీటర్ పెట్రోల్ పూర్తికావడానికి మీటర్ 5,10, 15 లను కలుపుతూ ముందుకు వెళ్లాలి. ఇలా తిరిగితే సాధారణంగా పెట్రోల్ పోస్తున్నారని అర్థం. కానీ 10,20,30 కలుపుతూ మీటర్ తిరిగితే మాత్రం ఇందులో మోసం ఉందని గ్రహించాలి. కొందరు ఇలా సెట్ చేసి తక్కువ పెట్రోల్ పోసి అనుకున్న విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే ఇది ఎక్కువగా పాత పెట్రోల్ బంకుల్లో మాత్రమే జరుగుతుంది. దీనిపై అవగాహన ఉన్న వారు పెట్రోల్ బంకులను నిలదీస్తున్నారు. కానీ అవగాహన లేని వారు మాత్రం నష్టపోతున్నారు.

    అందువల్ల పెట్రోల్ పోసుకునేటప్పుడు మీటర్ ఎలా తిరుగుతుందో గమనించాలి. అంతేకాకుండా పాత పెట్రోల్ బంకుల్లోకి కాకుండా అప్డేట్ అయిన పెట్రోల్ బంకుల్లోకి మాత్రమే పెట్రోల్ కొనుగోలు చేయడానికి వెళ్లాలి. పెట్రోల్ కొనుగోలు చేసేటప్పుడు ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే బంకు నిర్వాహకులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి.