https://oktelugu.com/

మిడిల్ క్లాస్ మెలోడీస్’ను అమెజాన్ ప్రైమ్ ఎంతకు కొనుగోలు చేసింది?

‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండ టాలీవుడ్లో స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. విజయ్ దేవరకొండ సపోర్టుతో ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ‘దొరసాని’ మూవీలో హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండ తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఇక రెండోసారిగా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ రాబోతుంది. Also Read: థియేటర్లు ఓపెన్ అయినా కన్పించని సందడి..ఇప్పుడేలా?  ఇటీవలే విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ట్రైలర్ మంచి టాక్ తెచ్చుకొంది. పల్లెటూరు బ్యాక్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2020 / 01:39 PM IST
    Follow us on

    ‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండ టాలీవుడ్లో స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. విజయ్ దేవరకొండ సపోర్టుతో ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ‘దొరసాని’ మూవీలో హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండ తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఇక రెండోసారిగా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ రాబోతుంది.

    Also Read: థియేటర్లు ఓపెన్ అయినా కన్పించని సందడి..ఇప్పుడేలా? 

    ఇటీవలే విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ట్రైలర్ మంచి టాక్ తెచ్చుకొంది. పల్లెటూరు బ్యాక్ డ్రాప్.. గుంటూరు నేపథ్యంలోనే ఈ మూవీ రాబోతుంది. భవ్యక్రియేషన్స్ బానర్లో నిర్మిస్తున్న ఈ మూవీకి వినోద్ అనంతోజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆనంద్ దేవరకొండ.. వర్షా బొల్లమ్మ హీరోహీరోయిన్లు నటిస్తున్న ఈ మూవీ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

    Also Read: రియల్ హీరో సోనుసూద్ సాయం వెనుక ఉందెవరు?

    ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ట్రైలర్ ఇప్పటికే 10లక్షల వ్యూస్ ను క్రాస్ చేసింది. ట్రైలర్ కంటే ముందుగా విడుదలైన గుంటూరు పాటకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. చిన్న సినిమాలకు పే ఫర్ వ్యూ చెల్లిస్తున్న అమెజాన్ ఈ మూవీని మాత్రం రూ.4.5కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఈ సినిమాపై నమ్మకంతోనే అమెజాన్ ప్రైమ్ ముందుగానే డబ్బులు చెల్లించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఒకరకంగా హీరో ఆనంద్ దేవరకొండకు.. చిత్రయూనిట్ కు కలిసొచ్చే విషయమే. ‘దొరసాని’ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకోగా ఆ మూవీ ప్రభావం ఈ సినిమాపై పడలేదని తెలుస్తోంది. నవంబర్ 20న ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అమెజాన్ అంచనాలను అందుకుంటుందో  లేదో వేచిచూడాల్సిందే..!