టీఎస్ బీపాస్ ను ప్రారంభించిన కేటీఆర్

భవన నిర్మాణాలకు, లే అవుట్లకు 21 రోజుల్లో అనుమతి వచ్చేలా ఏర్పాటు చేసిన టీఎస్ బీపాస్ నుంచి రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం వెబ్ సైట్ ద్వారా ప్రారంభించారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణలో 58 శాతం జనాభా పట్టణాల్లోనే ఉంటుందన్నారు. పట్టణాల్లో మౌళిక వసతులపై ధ్రుష్టి సారించామన్నారు. పరిపాలనను వికేంద్రీకరించేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఇకపై ఆన్ లైన్లో పారదర్శకంగా ఇంటి […]

Written By: Suresh, Updated On : November 16, 2020 1:20 pm
Follow us on

భవన నిర్మాణాలకు, లే అవుట్లకు 21 రోజుల్లో అనుమతి వచ్చేలా ఏర్పాటు చేసిన టీఎస్ బీపాస్ నుంచి రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం వెబ్ సైట్ ద్వారా ప్రారంభించారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణలో 58 శాతం జనాభా పట్టణాల్లోనే ఉంటుందన్నారు. పట్టణాల్లో మౌళిక వసతులపై ధ్రుష్టి సారించామన్నారు. పరిపాలనను వికేంద్రీకరించేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఇకపై ఆన్ లైన్లో పారదర్శకంగా ఇంటి నిర్మాణాలకు అనుమతి లభిస్తుందన్నారు. 75 గజాల వరకు ఎలాంటి అనుమతి లేదని, ఆపైన ఉన్న వాటికి 21 రోజుల్లో అనుమతి వస్తుందన్నారు. ఒకవేళ ఎలాంటి సమాచారం లేకపోతే అనుమతి ఉన్నట్లేనని కేటీఆర్ తెలిపారు. లబ్ధిదారులు మొబైల్ యాప్ లేదా వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.