ఏపీలోని మచిలీపట్నంలో ఓ షాడో మంత్రి ఆగడాలు శ్రుతి మించిపోతున్నాయన్న ప్రచారం ఆ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.. మచిలీపట్నం మండలానికి చెందిన కార్యకర్తలు, నాయకులు, కష్టంలో ఉన్నవారు ఎవరైనా మంత్రి వద్దకు వస్తే వారి సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి.. తన వెంట ఉన్న షాడోకు పురమాయిస్తున్నారట. దీంతో సమస్యల పరిష్కారం సంగతి పక్కనపెట్టి ఈయన తనదైన శైలిలో కార్యకర్తలను, నాయకులను ఇరుకున పెడుతున్నాడని ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. నిత్యం మంత్రికి నీడలా ఉండే ఈయన ఆగడాలకు అంతు లేకుండా పోతోందని అధికార పార్టీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు.
Also Read: విశాఖలో జగన్ సర్కార్ పంజా..టీడీపీ నేతల ఆక్రమణలపై ఉక్కుపాదం
అంతేకాదు.. మచిలీపట్నం రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో ఓ గదిని ఈయన తన డెన్‌గా మార్చుకున్నాడట. తన మనిషికి జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్ష పదవి వచ్చేలా చక్రం తిప్పిన ఈ షాడో, రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేని విధంగా ఇక్కడ అధ్యక్షుడికి చాంబరును కేటాయించారు. ఈ చాంబరు నుంచే షాడో తన అక్రమ కార్యకలాపాలన్నింటినీ చక్కబెడుతున్నారని, పగలు, రాత్రి తేడా లేకుండా ఈ చాంబరులోనే మందు పార్టీలు నిర్వహిస్తుంటాడని విమర్శలు వస్తున్నాయి.
Also Read: వైసీపీలో అసమ్మతి.. అనూహ్య పరిణామం
స్థానిక పోలీస్‌స్టేషన్‌లోనూ ఈ షాడో హవా నడుస్తోందట. ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది ఈయన చెప్పిన ప్రతి దానికీ తలూపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఐదారు నెలలుగా జిల్లా పోలీసులు కాపుసారాను అరికట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. ఈ షాడో సొంత గ్రామంలో కాపుసారా తయారుచేసి, విక్రయిస్తున్న ఇద్దరిని తాలూకా పోలీసులు పట్టుకున్నారు. వారిపై ఎలాంటి కేసు పెట్టకుండా షాడో తెరవెనుక చక్రం తిప్పాడని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకూ తన గ్రామంలో కాపుసారా బట్టీలపై ఎలాంటి దాడులు చేయవద్దని ఆ పోలీసులకు హుకుం జారీచేశారట.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
తన మండలపరిధిలో 34 గ్రామ పంచాయతీల్లో 6,500 మంది పేదలకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇళ్ల స్థలాల మెరక పనులన్నింటినీ చేజిక్కించుకున్న ఈ షాడో మంత్రి తనదైన శైలిలో పనులు చేసి మమ అనిపించారని ఆ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. గిలకలదిండిలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేసిన భూమిని మెరకచేసేందుకు ప్రభుత్వ భూముల్లోని మట్టిని తరలించి, రూ.కోటి సొమ్ము చేసుకునేందుకు స్కెచ్ వేశాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ప్రతిపక్ష పార్టీ ఈ స్థలంపై కోర్టుకు వెళ్లడంతో మొట్టికాయలు పడ్డాయి. అందుకే తన ప్రయత్నానికి బ్రేక్ వేసినట్లుగా సమాచారం.