Amardeep: బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అమర్ దీప్ తన భార్య తేజస్విని తో కలిసి ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. ఈ క్రమంలో గతంలో శివాజీ తన పై చేసిన నెగిటివ్ కామెంట్స్ పై స్పందించాడు. ఈ నేపథ్యంలో అమర్ దీప్ శివాజీ పై ఫుల్ ఫైర్ అయ్యాడు. తన జోలికి వస్తే ఇంకా ఊరుకునేది లేదు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా కొందరి వలన తాను, తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.
అమర్ దీప్ బెస్ట్ ఫ్రెండ్ శోభ శెట్టి సుమన్ టీవీ లో కాఫీ విత్ శోభ పేరుతో టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇక ఇందులో భాగంగా శోభా ఇప్పటికే పలువురు బుల్లితెర సెలెబ్రెటీలను ఇంటర్వ్యూ చేసింది. లేటెస్ట్ గా అమర్ దీప్, తేజస్వినిలు ఈ షోలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో శోభా శెట్టి, అమర్ ని కొన్ని ప్రశ్నలు అడిగింది. నాలుగైదు వారాలకే అమర్ బయటకు వచ్చేయాల్సింది. కానీ అమర్ రన్నర్ అయ్యాడంటూ, కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు , దీనిపై నీ అభిప్రాయం ఏమిటని శోభ అడిగింది.
దీనికి సమాధానంగా అమర్… మొదటి ఐదు వారాలు నేను కంటెంట్ ఇవ్వలేదు సరే .. నేను ఒక్కడినేనా ఇంకెవ్వరు లేరా .. వాళ్ళు నాకు దేవుళ్ళు అని భజన చేస్తే .. నాకు నేను కూడా అంతే. నాకు నేనే కింగ్ .. నాకు నేనే బొంగు ..నీకు ఎందుకు రా అంటూ అమర్ స్ట్రాంగ్ కౌంటర్ విసిరాడు. తర్వాత ప్రశ్నగా శోభా .. లోపల శివాజీ గారు నీ గురించి చాలా కామెంట్స్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత కూడా నీ గురించి నెగిటివ్ కామెంట్స్ చేశారు కదా అని అడిగింది.
దీంతో అమర్ కి చాలా కోపంగా సమాధానం చెప్పాడు. వాటి గురించి మాట్లాడటం అనవసరం అన్న అమర్, తనపై ఉన్న నెగిటివిటీ గురించి పెద్దగా పట్టించుకోను, అలాంటివి లెక్కలోకి కూడా తీసుకోను అని అన్నాడు. కాగా తనపై విపరీతమైన నెగిటివిటీ పెరగడంతో భార్య తేజస్విని, అతని కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు అంటూ అమర్ దీప్ చెప్పుకొచ్చాడు. గతంలో అమర్ జానకి కలగనలేదు సీరియల్ లో హీరోగా చేశాడు. ఇటీవల హీరోగా ఓ మూవీ లాంచ్ చేశారు. సురేఖావాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా నటిస్తుంది.