Pan India Star: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తు పట్టారా?

ఈయన చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పైన మీరు చూస్తున్న ఫోటో ఎవరు అనుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఎంత క్యూట్ గా ఉన్నారో కదా.. ఆ క్యూట్ క్యూట్ కళ్లు, చిక్స్ చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాడో కదా..

Written By: Swathi Chilukuri, Updated On : February 12, 2024 4:55 pm
Follow us on

తెలుగులో స్టార్ హీరోలకు ఇతర దేశాలు, రాష్ట్రాల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరికి సంబంధించిన ఎలాంటి వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. అందులో భాగంగానే ప్రభాస్ కు సంబంధించిన ఏ చిన్న వార్త అయిన క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ఈయన నటించిన సినిమాలు భారీ రేంజ్ లో హిట్ అవుతుంటాయి. రీసెంట్ గా ఈయన సినిమాలు ఫ్లాప్ అవడంతో.. ఫ్యాన్స్ హట్ అయ్యారు. కానీ మళ్లీ ఈయన మార్కెట్ ఫుల్ గా పెరిగింది. అంతేకాదు రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించింది.

ఈయన చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పైన మీరు చూస్తున్న ఫోటో ఎవరు అనుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఎంత క్యూట్ గా ఉన్నారో కదా.. ఆ క్యూట్ క్యూట్ కళ్లు, చిక్స్ చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాడో కదా.. ఇలాంటి క్యూట్ బేబీ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. అప్పుడు అనుకున్నారా ఎవరైనా..ఈ చిన్నోడు పాన్ ఇండియా స్టార్ అవుతారు అని.. కానీ చూశారా ఏ రేంజ్ లో ఆయన సక్సెస్ ను సాధించారో చూస్తుంటే మరింత ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది కదా..

2015, 2017లో విడుదలైన ప్రభాస్ సినిమాలు ఇండియాలో ఆయనను భారీ పాపులర్ చేశాయి. ఈ హీరోకు తెలుగులోనే కాదు తమిళనాడు, కర్నాటకతో పాటు, ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. దాదాపు ఐదేళ్ల పాటు 1,2 సినిమాలకు అకింతమయ్యారు ప్రభాస్. అదే రేంజ్ లో సక్సెస్ ను కూడా సాధించారు. బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యాం వంటి సినిమాలు ప్రభాస్ కు ఆశించిన విజయాన్ని సంపాదించలేకపోయాయి. ఆ తర్వాత ఆదిపురుష్ సినిమా కూడా భారీ ఫ్లాప్ ను మూటగట్టుకుంది.

భారీ బడ్జెట్, భారీ ఆశలతో వచ్చిన ఈ సినిమాలు ప్రభాస్ ను నిరావ పరిచాయి. అంతేకాదు ఈ సినిమాల వల్ల విమర్శల పాలు అయ్యారు ప్రభాస్. ఈ సినిమాలు ఫ్లాప్ అవడంతో ప్రభాస్ వెనక్కు తగ్గారు. కానీ ఆ తర్వాత కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆయన రేంజ్ ను పడిపోకుండా చేశారు. సలార్ సినిమాతో మళ్లీ ప్రభాస్ అభిమానులకు సంతోషం వచ్చేసింది.