Amaravati : అమరావతి( Amaravathi ).. ఏపీ ప్రజల కలల సౌధం. ప్రజా రాజధాని అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు లక్ష్యం పెట్టుకున్నారు. తప్పకుండా తమ సహకారం ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. చంద్రబాబు అనుకుంటే సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిని పూర్తి చేయడం ద్వారా చరిత్రలో నిలిచిపోవాలని భావిస్తున్నారు. అమరావతిని పూర్తిచేసి 2029 ఎన్నికలకు వెళ్లాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. ఒకవైపు అమరావతికి నిధుల సమీకరణలో కొంత సక్సెస్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా అమరావతి రాజధాని పనులను నిరాటంకంగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టు ప్రణాళిక కూడా రూపొందించింది. వాటికి అనుగుణంగా అడుగులు వేయనుంది.
Also Read : లోకేష్ తర్వాత ఆయనే!
* ఆ విమర్శలు రాకుండా..
అయితే 2015లో అమరావతి రాజధాని( Amravati capital) నిర్మాణ పనులను ప్రారంభించింది నాటి టిడిపి ప్రభుత్వం. అయితే అప్పట్లో ఎక్కువ హడావిడి చేశారని.. పనుల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి లేకుండా పోయిందన్న విమర్శ ఉండేది. అటువంటి పరిస్థితి మరోసారి తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఒకటి మాత్రం నిజం పరిస్థితి గతం మాదిరిగా లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో టిడిపి కీలక భాగస్వామి. అదే సమయంలో చంద్రబాబును నమ్మదగిన మిత్రుడిగా ఇప్పుడు మోడీ భావిస్తున్నారు. మోడీని సైతం గౌరవిస్తూ ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. ఇంకోవైపు రాజకీయంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోడుగా ఉన్నారు. లోకేష్ సైతం యాక్టివ్ గా కనిపిస్తున్నారు. రాష్ట్ర బిజెపి సైతం చంద్రబాబుకు అండగా నిలుస్తోంది. అందుకే చంద్రబాబు అమరావతి పై ఫుల్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.
* గత అనుభవాల దృష్ట్యా..
గత అనుభవాలను గుణపాఠాలుగా తీసుకుంటే అమరావతి అతి త్వరలో సహకారం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మూడేళ్లు లక్ష్యంగా పెట్టుకున్నందున ప్రభుత్వం ప్రతి అంశాన్ని నిర్దేశించిన ప్రకారం అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు నడుచుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం సైతం ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్షించాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రతి సోమవారం పోలవరం( polavaram) అన్నట్టు.. అమరావతి రాజధాని విషయంలో సైతం కొంత సమయం కేటాయిస్తే.. పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగుతాయి. అనుకున్న లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయగలుగుతాము.
* మంత్రుల కమిటీ ఏర్పాటు..
అమరావతి విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో( deputy CM Pawan Kalyan) అభిప్రాయాలను పంచుకుంటున్నారు సీఎం చంద్రబాబు. కానీ రాష్ట్ర మంత్రివర్గంలో అమరావతి పై పెద్దగా సమన్వయం కనిపించడం లేదని విమర్శ ఉంది. ప్రస్తుతం క్యాబినెట్లో మంత్రి నారాయణ ఒక్కరే అమరావతి పనులను సమీక్షిస్తున్నారు. మిగిలిన మంత్రులు ఎవరు అమరావతి పనుల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అమరావతి రాజధాని నిర్మాణ పనుల పర్యవేక్షణకు మంత్రులతో కూడిన ఒక కమిటీని నియమించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
* నిధుల కొరత లేకుండా..
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఈ పనులకు నిధుల కొరత లేకుండా చూసుకోవాల్సిన అవసరం పై ఉంది. అమరావతి నిర్మాణానికి దాదాపు 60 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ఇప్పటివరకు 31 వేల కోట్లు మాత్రమే సమీకరించగలిగారు. కేంద్ర ప్రభుత్వం( central government) ప్రపంచ బ్యాంకు నుంచి 15 వేల కోట్ల నిధులను సర్దుబాటు చేసింది. కానీ ఇది విడతల వారీగా విడుదల అవుతాయి. అందుకే నిధుల విషయంలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం. కేంద్ర ప్రభుత్వ పరంగా అమరావతి అనుసంధాన ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.