https://oktelugu.com/

Amar-Prasanth fans : అమర్-ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య గొడవ… పాపం అది బలి

అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. రైతుబిడ్డ ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ గెలిచాడు. ప్రైజ్ మనీతో పాటు బహుమతులు అందుకున్నాడు....

Written By:
  • NARESH
  • , Updated On : December 18, 2023 / 11:14 AM IST
    Follow us on

    Amar-Prasanth fans : బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ స్టార్ హీరోల అభిమానులను తలపిస్తున్నారు. మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్స్ నడిచాయి. అన్నపూర్ణ స్టూడియో ఎదుట ముఖాముఖీ పోరులో తలపడ్డారు. సీజన్ ప్రారంభం నుండి పల్లవి ప్రశాంత్-అమర్ దీప్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. నామినేషన్స్ లో రైతులే కాదు అందరూ గొప్పే. నువ్వు సింపతీ గేమ్ ఆడుతున్నావని ప్రశాంత్ పై అమర్ విమర్శలు చేశాడు. అప్పుడు వార్ మొదలైంది. సోషల్ మీడియాలో ఒకరినొకరు విమర్సించుకునేవారు.

    పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దారుణమైన బూతులు తిడుతున్నారని అమర్ దీప్ తల్లి వేదన చెందింది. ఆమె ఫైర్ అయ్యారు. పల్లవి ప్రశాంత్ ఏమైనా ఆకాశం నుండి ఊడిపడ్డాడా అంటూ మండిపడింది. హౌస్లో ప్రశాంత్-అమర్ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. 14వ వారం అయితే అమర్ కొంచెం హద్దులు మీరాడు. నీ అసలు స్వరూపం బయటపెడతా అంటూ ప్రశాంత్ మీద విరుచుకుపడ్డాడు. చెప్పాలంటే ప్రశాంత్ తో కొంచెం హార్ష్ గా బిహేవ్ చేశాడు. హోస్ట్ నాగార్జున కూడా అమర్ దీప్ ని మందలించాడు.

    ఈ ఘటనతో ప్రశాంత్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అమర్ దీప్ ని వారు మరింత హేట్ చేస్తున్నారు. డిసెంబర్ 17 ఆదివారం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగిసింది. అన్నపూర్ణ స్టూడియో ఎదుట పదుల సంఖ్యలో అమర్ దీప్, ప్రశాంత్ ఫ్యాన్స్ చేరుకున్నారు. వారు బయట నినాదాలు చేశారు.ఈ క్రమంలో అమర్, ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగాయి. ఒకరినొకరు కొట్టుకోబోయారు. ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ మీద దాడి చేశారు. అమర్ ఉన్న కారు అద్దాలు పగలగొట్టారు.

    ఈ క్రమంలో అమర్ , ప్రశాంత్ ఫ్యాన్స్ ఆర్టీసీ బస్సును కూడా ద్వంసం చేశారు. అటుగా వెళుతున్న టీఎస్ ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టారు. అందులో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అమర్, ప్రశాంత్ ఫ్యాన్స్ తీరుపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక టైటిల్ పోరులో కూడా వీరిద్దరే నిలిచారు. అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. రైతుబిడ్డ ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ గెలిచాడు. ప్రైజ్ మనీతో పాటు బహుమతులు అందుకున్నాడు….