Amardeep : అమర్ నిజమైన హీరో… పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్న ఆ మాజీ కంటెస్టెంట్! వీడియో వైరల్

అరియానా మొదటినుంచి అమర్ ని సపోర్ట్ చేస్తూ వచ్చింది. అమర్ దీప్, అరియానా బెస్ట్ ఫ్రెండ్స్. తాజాగా ఆమె అమర్ దీప్ తో ఉన్న ఓ వీడియో పోస్ట్ చేసింది. అమర్ దీప్ నిన్ను చూసి చాలా గర్విస్తున్నా అరె పది కాకులు పది రకాలుగా మాట్లాడుకుంటారు.

Written By: NARESH, Updated On : December 28, 2023 8:01 pm
Follow us on

Amardeep : బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ అమర్ దీప్ హౌస్ లోకి భారీ అంచనాలతో వచ్చాడు. కానీ అనుకున్నంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. పైగా ప్రశాంత్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన తీరు నెగిటివిటీకి కారణం అయ్యింది. ఎలాగైనా గెలవాలి అనే తపనతో ఫౌల్ గేమ్ ఆడి .. నాగార్జున తో తిట్లు తినడం, గేమ్స్ లో ఎమోషన్స్ కోల్పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడడంతో .. విపరీతమైన ట్రోలింగ్ కు గురైయ్యాడు. అమర్ తో పాటు అతని ఫ్యామిలీ ని కూడా దారుణంగా ట్రోల్ ప్రేక్షకులు చేశారు. ఒకానొక సమయంలో అమర్ కి సపోర్ట్ చేయడానికి కూడా అతని భార్య తేజు భయపడింది.

అంత ఘోరంగా అమర్ హేటర్స్ వాళ్లను ట్రోలింగ్ తో భాధ పెట్టారు. అయితే ముందు నుంచి అమర్ దీప్ ను కొందరు సెలబ్రిటీస్ సపోర్ట్ చేస్తూ వచ్చారు. అతని బెస్ట్ ఫ్రెండ్స్ అయిన మానస్, అరియానా గ్లోరి, నరేష్ లొల్ల వంటి వారు అండగా నిలిచారు. ఎప్పటికప్పుడు అమర్ దీప్ కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మద్దతు తెలుపుతూ వచ్చారు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 ముగిసింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే.

అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. కానీ ఆ తర్వాత అసలైన రచ్చ మొదలైంది. అభిమానుల పేరుతో కొందరు అల్లరి మూకలు విధ్వంసం చేశారు. అందుకు పల్లవి ప్రశాంత్ కూడా పరోక్షంగా కారణం అయ్యాడంటూ అంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పై ప్రశాంత్ బయటకు రావడం చకచకా జరిగిపోయాయి. కాగా సోషల్ మీడియా క్రేజీ బ్యూటీ, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

అరియానా మొదటినుంచి అమర్ ని సపోర్ట్ చేస్తూ వచ్చింది. అమర్ దీప్, అరియానా బెస్ట్ ఫ్రెండ్స్. తాజాగా ఆమె అమర్ దీప్ తో ఉన్న ఓ వీడియో పోస్ట్ చేసింది. అమర్ దీప్ నిన్ను చూసి చాలా గర్విస్తున్నా అరె పది కాకులు పది రకాలుగా మాట్లాడుకుంటారు. నువ్వు నిజం రా. అమర్ .. నువ్వు హీరో. జనాలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. మా అమర్ కి సపోర్ట్ చేసిన వాళ్లందరికి థాంక్యూ అని పోస్ట్ చేసింది. అయితే కొందరు అరియానా పోస్ట్ ను సపోర్ట్ చేస్తే .. మరికొందరు పల్లవి ప్రశాంత్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.