https://oktelugu.com/

Amala Paul: ఇవి ఉంటే.. ఇక అవి ఎందుకు ?.. ఆ హీరోయిన్ కి పైసామే పరమాత్మ !

Amala Paul: హీరోయిన్ గా ఒకప్పుడు మంచి స్థితిలో ఉన్న అమలాపాల్ ఫామ్ కోల్పోయింది. ప్రస్తుతం వెబ్ సినిమాలు చెయ్యడంలో ముందు ఉంది. కరోనా లాక్ డౌన్ టైం లో అమలాపాల్ నటించిన పలు చిత్రాలు ఓటీటీ వేదిక పైకి వచ్చాయి. అయితే ఓటిటి లో విడుదలయ్యాయి అనే పేరు అయితే వచ్చింది గాని.. ఏ సినిమా ఆకట్టుకోలేదు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు లాక్ డౌన్ లేదు. అయినా, అమలాపాల్ మాత్రం వెబ్ సినిమాలు ఆపడం లేదు. […]

Written By:
  • Shiva
  • , Updated On : May 7, 2022 6:15 pm
    Follow us on

    Amala Paul: హీరోయిన్ గా ఒకప్పుడు మంచి స్థితిలో ఉన్న అమలాపాల్ ఫామ్ కోల్పోయింది. ప్రస్తుతం వెబ్ సినిమాలు చెయ్యడంలో ముందు ఉంది. కరోనా లాక్ డౌన్ టైం లో అమలాపాల్ నటించిన పలు చిత్రాలు ఓటీటీ వేదిక పైకి వచ్చాయి. అయితే ఓటిటి లో విడుదలయ్యాయి అనే పేరు అయితే వచ్చింది గాని.. ఏ సినిమా ఆకట్టుకోలేదు.

    Amala Paul

    Amala Paul

    ప్రస్తుతానికి అయితే ఇప్పుడు లాక్ డౌన్ లేదు. అయినా, అమలాపాల్ మాత్రం వెబ్ సినిమాలు ఆపడం లేదు. తాజాగా ఆమె మరో ఓటీటీ సినిమా చేసింది. అది అమెజాన్ ప్రైమ్ లోకి రాబోతుంది. ఈ సినిమా బాగా వచ్చింది అని సినిమా గురించి తెలిసిన వారు మెచ్చుకుంటున్నారు. అమలాపాల్ ఇందులో పూర్తిగా డిగ్లామరైజ్ రోల్ చేసింది.

    Also Read: Sarkaru Vaari Paata: మహేష్ ‘సర్కారు..’కు జగన్ స‌ర్కారు శుభవార్త !

    నిజానికి గతంలో కూడా అమలాపాల్ ఇలాంటి రోల్స్ చాలానే చేసింది. కానీ, ఆమెకు రావాల్సిన పేరు మాత్రం రావడం లేదు. ఇప్పటికే అమలాపాల్ నటించిన పలు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు వెబ్ లోకి వచ్చాయి. కానీ, ఏ సినిమా కూడా అమలాపాల్ కి మంచి పేరు తీసుకురాలేదు.

    ఎందుకు అమలాపాల్ కష్టానికి గుర్తింపు రావట్లేదు. రాకపోయినా.. ఈ వెబ్ సినిమాలు మాత్రం అమలాపాల్ ఆపాలనుకోవడం లేదు. ఎందుకంటే తక్కువ టైంలో ఇలాంటి చిత్రాలు పూర్తి అవుతాయి. పైగా పారితోషికం ఫుల్ గా ఉంటుంది. అన్నిటికీ మించి అమలాపాల్ కి ప్రస్తుతం సినిమాలు లేవు.

    Amala Paul

    Amala Paul

    అందుకే.. వెబ్ చిత్రాల పై పడింది. పారితోషికం కూడా ఎలాగూ బాగుంటుంది. అన్నట్టు అమలాపాల్ కొత్తగా మరో రెండు చిత్రాలు ఒప్పుకుంది. వాటి షూటింగ్ లు పూర్తి కావాలంటే ఏడాది పైనే పడుతుంది. అందుకే.. మళ్లీ సినిమాల్లో నటించాలని అమలాపాల్ అస్సలు ప్రయత్నాలు చేయడం లేదు. అందుకే ఇవి (ఓటీటీ చిత్రాలు) ఉంటే.. ఇక అవి (సినిమాలు) ఎందుకు ?అంటుంది అమలాపాల్.

    Also Read:Ukraine- Russia Conflict- India: డచ్ రాయబారికి కౌంటర్.. దెబ్బకు ట్వీట్ తొలగింపు

    Tags