Bhala Thandanana: ప్చ్.. పరిణతి పెరిగింది.. సినిమా ప్లాప్ అయ్యింది !

Bhala Thandanana: శ్రీవిష్ణు నటించిన ‘భళా తందనాన’ సినిమా విడుదలయింది. ఈ సినిమా కథలో కన్నా, కథనంలో మెచ్చుకునే అంశాలు ఉన్నాయి. సినిమా స్లోగా సాగింది అనేది పక్కన పెడితే శ్రీవిష్ణు నటన బాగుంది. అందులోనూ పరిణతి కనిపించింది. శ్రీవిష్ణు ఇప్పటివరకు రఫ్ అండ్ టఫ్ పాత్రలు చేశాడు. అతని నటనలో ఈజ్ ఉంటుంది. కానీ, ఈ సినిమాలో పాత్రకు తగ్గట్లుగా ఒదిగిపోయాడు. పూర్తిగా డామినేట్ చెయ్యకుండా పాత్రకు ఎంత కావాలో అంతే చేశాడు. అదే నటుడిగా […]

Written By: Shiva, Updated On : May 7, 2022 6:24 pm
Follow us on

Bhala Thandanana: శ్రీవిష్ణు నటించిన ‘భళా తందనాన’ సినిమా విడుదలయింది. ఈ సినిమా కథలో కన్నా, కథనంలో మెచ్చుకునే అంశాలు ఉన్నాయి. సినిమా స్లోగా సాగింది అనేది పక్కన పెడితే శ్రీవిష్ణు నటన బాగుంది. అందులోనూ పరిణతి కనిపించింది. శ్రీవిష్ణు ఇప్పటివరకు రఫ్ అండ్ టఫ్ పాత్రలు చేశాడు. అతని నటనలో ఈజ్ ఉంటుంది.

Bhala Thandanana

కానీ, ఈ సినిమాలో పాత్రకు తగ్గట్లుగా ఒదిగిపోయాడు. పూర్తిగా డామినేట్ చెయ్యకుండా పాత్రకు ఎంత కావాలో అంతే చేశాడు. అదే నటుడిగా మెచ్యూరిటీ చూపించడం అంటే. శ్రీవిష్ణు తన లుక్ మీద తానే జోకులు వేసుకున్నాడు. రఫ్ లుక్ లో నటించాడు. అలాగే, ముద్దు సన్నివేశాలు లేకుండా ఫ్యామిలీ అండ్ యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు శ్రీవిష్ణు.

Also Read: Amala Paul: ఇవి ఉంటే.. ఇక అవి ఎందుకు ?.. ఆ హీరోయిన్ కి పైసామే పరమాత్మ !

కొత్త తరం హీరోల్లో కొందరు తమ పాత్రలను బాగా అర్థం చేసుకుంటున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు అది చూపించాడు. నిజానికి శ్రీవిష్ణు తన నటనతో ఎప్పుడు చాలా బాగా ఆకట్టుకుంటాడు. పైగా శ్రీవిష్ణులో మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంది.

Bhala Thandanana

ఇక ‘భళా తందనాన’ అంటూ వచ్చిన ఈ క్రైమ్ యాక్షన్ డ్రామాలో ఎమోషనల్ పాత్రలో నటించిన శ్రీవిష్ణు, ఆ పాత్రకు తగ్గట్లు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకుంటూ కొన్ని కీలకమైన సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.

కాకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టలేక చతికిలపడింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి ఉంటే.. శ్రీవిష్ణు స్టార్ డమ్ మరో స్థాయికి వెళ్ళేది. మరి చూడాలి, ఈ హీరో ఏ రేంజ్ కి వేళ్తాడో అని.

Also Read:Posani Krishna Murali: పోసాని పశ్చాతాపం.. మారిన పవన్ పై అభిప్రాయం !

Tags