https://oktelugu.com/

Yadadri- KCR: యాదాద్రి లోపాలు కేసీఆర్ మెడకే చుట్టుకుంటున్నాయా?

Yadadri- KCR: యాదాద్రి ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ నిర్మాణంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు.దీంతో తిరుమల తిరుపతి స్థాయిలో ఆలయం ముస్తాబు చేయడంతో అందరు ప్రశంసించారు. ఆలయ పరిసర ప్రాంతాలు అద్భుతంగా ఉన్నాయని అందరు పొగుడుతున్నారు. పార్కింగ్ చార్జీలు మాత్రం భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే బుధవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయంగా మారడంతో ఒక్కసారిగా విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ తీరుపై భక్తుల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయం ప్రారంభం తరువాత భారీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 7, 2022 / 06:09 PM IST
    Follow us on

    Yadadri- KCR: యాదాద్రి ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ నిర్మాణంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు.దీంతో తిరుమల తిరుపతి స్థాయిలో ఆలయం ముస్తాబు చేయడంతో అందరు ప్రశంసించారు. ఆలయ పరిసర ప్రాంతాలు అద్భుతంగా ఉన్నాయని అందరు పొగుడుతున్నారు. పార్కింగ్ చార్జీలు మాత్రం భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే బుధవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయంగా మారడంతో ఒక్కసారిగా విమర్శలు వస్తున్నాయి.

    Yadadri

    కేసీఆర్ తీరుపై భక్తుల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయం ప్రారంభం తరువాత భారీ వర్షం కురవడంతో పనుల్లో లోపాలు బయటపడ్డాయి. ఆలయ పనుల్లో ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి తావు లేదని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.సామాజిక మాధ్యమాల్లో వర్షం గురించి విమర్శలు వస్తున్నాయి. ఆలయంపై కేసీఆర్ కు ఉన్న శ్రద్ధ ఇదేనా అని వాదనలు వస్తున్నాయి.

    Also Read: Ukraine- Russia Conflict- India: డచ్ రాయబారికి కౌంటర్.. దెబ్బకు ట్వీట్ తొలగింపు

    ఒక్క వర్షానికే ఇలాగైతే భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. యాదాద్రి ఆలయ పనులు ఇంత అధ్వానమా అని కాంట్రాక్టర్ పై నిప్ులు చెరుగుతున్నారు. దీనిపై అధికారులు సైతం పలు రకాల కారణాలు చెబుతూ తప్పించుకోవాలని చూస్తున్నారు.కానీ ప్రజలు మాత్రం కడిగేస్తున్నారు. పనుల్లో డొల్లతనం గురించి ఆరా తీస్తున్నారు. ఎందుకిలా జరిగిందని కూపీ లాగుతున్నారు.

    Yadadri- KCR

    పనుల్లో లోపాలు ఉన్నా ఎందుకు ఉపేక్షించారని ప్రశ్నిస్తున్నారు. పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతోనే ఇలా జరిగిందని తెలుస్తోంది. ప్రభుత్వంపై అన్ని దారుల్లో విమర్శలు వస్తున్నాయి. సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. ఆలయ పనుల్లో ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరించారని దుయ్యబడుతున్నారు. అందులో కూడా పర్సంటేజీలేనా అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కు ఇక తిప్పలే అని తెలస్తోంది. ఆలయ నిర్మాణంతో తామేదో గొప్పలు చేసినట్లు చెప్పుకున్నా ఇప్పుడు నిర్లక్ష్యం బయటపడటంతో తలెత్తుకోలేని పరిస్థితి కనిపిస్తోంది.

    Also Read:KTR- Congress Party: కాలం చెల్లిన పార్టీతో పొత్తా? కాంగ్రెస్ కు చురకలంటించిన కేటీఆర్

    Tags