కరోనా వేళ కూడా ఇలా పీక్కుతింటారా?

మనిషి చనిపోయాక ఆ శవాలను పీక్కుతింటాయి నక్కలు.. రాబందులు. కానీ బతికుండగానే ఈ కరోనా ఆపత్కాలంలో మనుషులను పీక్కుతింటున్నాయి ప్రైవేట్ స్కూళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యాపారమైంది. మరీ అంగడి సరుకైంది.. ప్రభుత్వ పాఠశాలలు కునారిల్లిన వేళ ప్రైవేట్ ఆస్పత్రులే జనాలకు దిక్కయ్యాయి. ప్రైవేట్ మోజులో పడి తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జివికె రెడ్డి వ్యాపారాలపై సిబిఐ దాడుల వెనక అసలు ఉద్దేశం ? అసలే కరోనా కాలం.. […]

Written By: NARESH, Updated On : July 8, 2020 11:27 am
Follow us on


మనిషి చనిపోయాక ఆ శవాలను పీక్కుతింటాయి నక్కలు.. రాబందులు. కానీ బతికుండగానే ఈ కరోనా ఆపత్కాలంలో మనుషులను పీక్కుతింటున్నాయి ప్రైవేట్ స్కూళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యాపారమైంది. మరీ అంగడి సరుకైంది.. ప్రభుత్వ పాఠశాలలు కునారిల్లిన వేళ ప్రైవేట్ ఆస్పత్రులే జనాలకు దిక్కయ్యాయి. ప్రైవేట్ మోజులో పడి తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

జివికె రెడ్డి వ్యాపారాలపై సిబిఐ దాడుల వెనక అసలు ఉద్దేశం ?

అసలే కరోనా కాలం.. అందరి ఉద్యోగ, ఉపాధి కోల్పోయి బతుకుజీవుడా అంటూ కలోగంజో తాగి బతికేస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ ఆగడం లేదు. ఆన్ లైన్ క్లాసుల పేరిట వేలు, లక్షలు కట్టించుకుంటూ ప్రతీ విద్యార్థి ట్యాబ్, ల్యాప్ టాప్, లేదా ఫోన్ కొనుక్కోవాలంటూ తరగతులు స్ట్రాట్ చేశాయి. వారి నుంచి ముక్కుపిండీ మరీ ఫీజులు వసూలు చేస్తూ ఈ కొత్త దందా మొదలుపెట్టారు..

తెలంగాణలో ఈ ప్రైవేట్ స్కూల్స్ దోపిడీని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కరోనా భయంతో సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లారని ప్రచారం సాగుతోంది. ఇక ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈ దందా తెలంగాణలో మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.

ఏపీలో వారి దాహం తీరనిది.!

అయితే ఏపీలో మాత్రం విద్యకోసం పాటుపడుతున్న సీఎం జగన్ ఊరుకోలేదు. ఇప్పటికే సర్కార్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టిన జగన్ ఇప్పుడు తాజాగా ప్రైవేట్ స్కూల్స్ దోపిడీని అరికట్టేశాడు. ప్రైవేటు విద్యాసంస్థలు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్ హెచ్చరించారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు విద్యాసంవత్సరం 2020 ఆగస్టు 3న ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. 2020-21 విద్యా సంవత్సర షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసే వరకు ఆన్‌లైన్ తరగతులకు వెళ్లవద్దని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు స్పష్టం చేశారు. ఆన్‌లైన్ తరగతులకు విద్యార్థులు హాజరుకావడానికి స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, టాబ్లెట్లు కొనలేమని కొంతమంది తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇలా దోపిడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రైవేట్ స్కూల్స్ పై ఏపీలో ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ మహానగరం ఉన్న తెలంగాణలో మాత్రం ఈ అందరి సమస్య ఎవరికీ పట్టకపోవడం శోచనీయమే..

-ఎన్నం