Amala Paul: పంథా మార్చిన అమలాపాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఇక వరుస ఫోటో షూట్స్ తో హీటెక్కిస్తున్నారు. ఈ కేరళ భామ తీరు చూసిన నెటిజెన్స్ ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. ఆమె అందాల జడిలో తడిసి ముద్దవుతున్నారు. పొట్టి పొట్టి బట్టల్లో ఆమె అంగాంగ ప్రదర్శన చేస్తుంటే సౌందర్య ఆరాధకులు ఆస్వాదిస్తున్నారు. అమలా పాల్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ అంతకంతకూ పెరుగుతూ పోతున్నారు.

2009లో విడుదలైన మలయాళ చిత్రం నీల తామర తో అమలాపాల్ వెండితెరకు పరిచయం అయ్యారు. మైనా వంటి చిత్రాలతో ఆమె ఫేమ్ తెచ్చుకున్నారు. ఇక తెలుగులో బెజవాడ, నాయక్, ఇద్దరు అమ్మాయిలతో, జండాపై కపిరాజు వంటి చిత్రాల్లో నటించారు. చరణ్ హీరోగా విడుదలైన నాయక్, అల్లు అర్జున్ ఇద్దరు అమ్మాయిలతో ఓ మోస్తరు విజయాలు అందుకున్నాయి.అయినప్పటికీ తెలుగులో ఆమెకు చెప్పుకోదగ్గ గుర్తింపు, బ్రేక్ రాలేదు.

‘ఆమె’ మూవీలో అమలా పాల్ పూర్తి నగ్నంగా నటించి షాక్ ఇచ్చింది. అమలా పాల్ డేరింగ్ చూసి ఫ్యాన్స్ ఔరా అన్నారు. ‘ఆమె’ మూవీలో సెకండ్ హాఫ్ మొత్తం అమలా పాల్ నగ్నంగా నటించడం విశేషం. ఇక తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఆమె పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కమర్షియల్ గా కూడా ఆమె మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్స్ రావడం లేదు.
ఇక అమలా పాల్ లైఫ్ లో చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. ఆమె దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్ళైన రెండేళ్లకే 2016లో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో 2017లో విడాకులు తీసుకొని అధికారికంగా విడిపోయారు. ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉంటున్నారు. ఓ లగ్జరీ కారు కొనుగోలు, టాక్స్ పేమెంట్ విషయంలో అమలా పాల్ చట్టపరమైన చర్యలు ఎదుర్కొన్నారు.

ఇటీవల టాలీవుడ్ పై ఆమె విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా బీచ్ లో అర్థ నగ్నంగా దర్శనమిచ్చింది. బికినీని పోలిన దుస్తులు ధరించిన అమలా పాల్ కవ్వించే ఫోజులతో సాగర తీరాన్ని హీటెక్కించింది. ఇసుక తిన్నెల్లో ఆసనాలు వేస్తూ కుర్ర హృదయాలు దోచేశారు. అమలా పాల్ హాట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఇక నెటిజెన్స్ ఆమె గ్లామర్ చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Recommend videos: