Sharwanand- Prabhas: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వేల కోట్ల రూపాయిలు విలువ చేసే ప్రాజెక్ట్స్ చేస్తున్న ఏకైక హీరో మన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..బాహుబలి సిరీస్ తర్వాత ఆయన చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినప్పటికీ కూడా ఆయనతో భారీ బడ్జెట్ సినిమాలు చెయ్యడానికి ఏ మాత్రం వెనకాడట్లేదు దర్శక నిర్మాతలు..ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ప్రాజెక్ట్ K ..మహానటి దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ మీద సి.అశ్వినీదత్ సుమారు 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు..అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుండగా..బాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది..ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 22 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల కానుంది.

ప్రస్తుతం ఇప్పటి వరుకు సజావుగా సాగిన ఈ సినిమా ఇప్పుడు చాలా రిస్క్ లో పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ గా వినిపిస్తున్న వార్త..అసలు విషయానికి వస్తే ఇటీవలే యంగ్ హీరో శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమా విడుదలై ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలో హీరో శర్వానంద్ గతం లో ఉన్న తన తల్లిని కలుసుకునేందుకు టైం మెషిన్ లో వెనక్కి వెళ్తాడు..సైన్స్ ఫిక్షన్ తో తల్లి సెంటిమెంట్ ని జోడించి ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్..అయితే ప్రభాస్ ప్రాజెక్ట్ K కూడా ఇలాంటి సబ్జెక్టు ని ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్న చిత్రమట..రెండు స్టోరీలైన్ లు ఒకేలాగా ఉంటుందట..ఇప్పుడు ‘ఒకే ఒక జీవితం’ మూవీ ప్రభావం ప్రభాస్ మూవీ మీద పడుతుందా అని అభిమానులు భయపడుతున్నారు..అయితే థ్రిల్ ఫాక్టర్ జనాలు మిస్ అవవడం మాత్రం పక్కా కానీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి కథ ఒకే లైన్ అయినా కథనం డిఫరెంట్ గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా అభిమానులను మరియు ప్రేక్షకులను ప్రభాస్ గత రెండు సినిమాలు లాగ నిరాశపరుస్తుందా..లేదా బాహుబలి రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందా అనేది చూడాలి.