https://oktelugu.com/

Amala Paul Second Marriage: ముద్దులు, ముచ్చట్లు.. అమలాపాల్ రెండో పెళ్లి ఫోటోలు వైరల్

తెలుగులో నాయక్, ఇద్దరమ్మాయిలతో అనే సినిమాల్లో నటించిన ఫేమస్ అయింది. ఇలా కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : November 6, 2023 / 10:30 AM IST
    Follow us on

    పరిచయం అవసరం లేని పేరు అమలాపాల్. ఈ కేరళ బ్యూటీ తన అందచందాలతో తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల సినిమాల్లో నటించి మెప్పించింది. మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన టాలెంట్ తో ఎదిగిందనే చెప్పాలి. మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన తన ప్రస్థానాన్ని ఇతర ఇండస్ట్రీలోకి కూడా విస్తరించేలా చేసుకుంది. తెలుగులో నాయక్, ఇద్దరమ్మాయిలతో అనే సినిమాల్లో నటించిన ఫేమస్ అయింది. ఇలా కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

    వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి. కానీ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే ఈ జంట విడిపోయింది. సినిమాల్లో నటించకూడదు అనే కండీషన్ పెట్టారో, లేదా భర్త తరపున ఏవైనా సమస్యలు ఉన్నాయో తెలియదు కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు ఈ జంట. అలా ఇద్దరి మధ్య పెళ్లి బంధం బ్రేక్ అయింది. అయితే ఆ మధ్య అమలాపాల్ పెళ్లి చేసుకుంది అనే రూమర్ వచ్చింది. కానీ అది కేవలం యాడ్ కోసమే అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే పది రోజుల కిందటే ఈ అమ్మడు పుట్టిన రోజు. అంతే అక్టోబర్ 26న ఒక వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో అమలాపాల్ కి ప్రపోజ్ చేస్తూ నా లవ్ యాక్సెప్ట్ చేసిందని ఓ పోస్ట్ పెట్టాడు. ఆమెతో ఉన్న రొమాంటిక్ ఫోటోలు, రొమాంటిక్ వీడియోలు కూడా షేర్ చేసుకున్నారు.

    ఇక లవ్ యాక్సెప్ట్ చేసిన పదిరోజులకే ఆ వ్యక్తితో పెళ్లి పీటలు ఎక్కింది అమల. అంటే నిన్ననే వీరిద్దరి పెళ్లి కుటుంబ సభ్యుల మధ్య అంగరంగా వైభవంగా జరిగింది. ఇక అమలా పెళ్లాడిన వ్యక్తి పేరు జగత్ దేశాయ్. వీరిద్దరు కేరళలోని ఓ హోటల్లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. మొత్తం మీద ఇలా రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్ సంతోషంగా ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.