Vijayawada: విజయవాడలో ఘోర ప్రమాదం సంభవించింది.ఆర్టీసీ కాంప్లెక్స్ లోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.బస్సు దూసుకెళ్లిన తీరు భయానకంగా మారింది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడ నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్లాట్ ఫామ్ పై నిరీక్షిస్తున్న ప్రయాణికులపై బస్సు తీసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.మృతుల్లో కండక్టర్ తో పాటు ఓ మహిళ, పది నెలల చిన్నారి ఉన్నారు. ఇంకా చాలామంది ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. విజయవాడలోని ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు గుంటూరు వెళ్లాల్సి ఉంది. సోమవారం ఉదయం 12వ నెంబర్ ప్లాట్ ఫారం వద్దకు ఈ బస్సు వచ్చింది. బస్సు స్టార్ట్ చేసే క్రమంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. ఎదురుగా బెంచిలపై కూర్చున్న ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ కండక్టర్ తో పాటు పదేళ్ల చిన్నారి, ఓ మహిళ మృతి చెందింది. బస్సు చక్రాల కింద చాలామంది ప్రయాణికులు చిక్కుకున్నారు. వారిని అతి కష్టం మీద బయటకు తీశారు.
బస్సు కండిషన్ పై అనుమానాలు ఉన్నాయి. అయినా సరే సర్వీసులను ఏర్పాటు చేయడంతో సిబ్బంది తప్పనిసరి పరిస్థితుల్లో బస్సును తీసినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాకా ఈ ఘటనలో మృతి చెందిన కండక్టర్ గుంటూరు రెండో డిపోకు చెందిన వీరయ్య గా గుర్తించారు. మృతి చెందిన మహిళతో పాటు చిన్నారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాలం చెల్లిన ఆర్టీసీ వాహనాలు నడుపుతున్న ఏపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.