https://oktelugu.com/

Amala Akkineni: అమ్మతో నవ్వులు చిందిస్తున్న టీనేజ్ గర్ల్ టాలీవుడ్ స్టార్ హీరో వైఫ్.. ఎవరో గుర్తు పట్టారా?

ఈమెకు ఒక కుమారుడు కాగా అతడు కూడా హీరో. టాలీవుడ్ పెద్దింటి కోడలు. ఇన్ని హింట్స్ ఇచ్చాక మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. మీరు అనుకున్నది నిజమే.

Written By:
  • S Reddy
  • , Updated On : April 29, 2024 / 05:52 PM IST

    Amala akkineni rare unseen childhood pic goes viral

    Follow us on

    Amala Akkineni: పైన ఫోటోలో అమ్మ పక్కన నిల్చుని అమాయకంగా పోజిచ్చిన టీనేజ్ గర్ల్ ఓ హీరోయిన్. అలాగే ఓ స్టార్ హీరో భార్య. ప్రస్తుతం ఆమె ఆచితూచి సినిమాలు చేస్తుంది. సామాజిక కార్యకర్తగా కూడా ఉన్నారు. ఈమెకు ఒక కుమారుడు కాగా అతడు కూడా హీరో. టాలీవుడ్ పెద్దింటి కోడలు. ఇన్ని హింట్స్ ఇచ్చాక మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. మీరు అనుకున్నది నిజమే. ఆ పాప ఎవరో కాదు అమల అక్కినేని. చిన్న వయసులో తల్లితో పాటు దిగిన ఫోటో అది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    అమల పశ్చిమ బెంగాల్ లో జన్మించింది. ఈమె తండ్రి నావీ అధికారి. తల్లి ఐర్లాండ్ కి చెందిన మహిళ. 1986 లో విడుదలైన తమిళ చిత్రం మైథిలి ఎన్నై కాదలి తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. తెలుగులో కిరాయి దాదా ఆమె మొదటి చిత్రం. నాగార్జునతో అమల అత్యధికంగా చిత్రాలు చేసింది. వీరి కాంబినేషన్ లో చినబాబు, శివ, ప్రేమ యుద్ధం, నిర్ణయం చిత్రాలు తెరకెక్కాయి. ఆ క్రమంలో ప్రేమలో పడ్డారు.

    దగ్గుబాటి లక్ష్మీతో విడాకులు తీసుకున్న నాగార్జున అమలను రెండో వివాహం చేసుకున్నారు. 1992లో నాగార్జున-అమల వివాహబంధం లో అడుగుపెట్టారు. వీరికి అఖిల్ సంతానం. అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అఖిల్ పరిశ్రమలో అడుగుపెట్టి ఐదేళ్లు దాటిపోయింది. అయినా బ్రేక్ రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మినహాయిస్తే అఖిల్ ఖాతాలో హిట్ అనేది లేదు. అమల స్టెప్ సన్ నాగ చైతన్య తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

    అమల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అనంతరం అక్కినేని హీరోల ఫ్యామిలీ చిత్రం మనం లో గెస్ట్ రోల్ చేసింది. ఇక శర్వానంద్ హీరోగా 2022లో విడుదలైన ఒకే ఒక జీవితం చిత్రంలో అమల హీరో తల్లిగా కీలక పాత్ర చేసింది. హైదరాబాద్ బ్లూ క్రాస్ సొసైటీ మెంబర్ గా ఆమె ఉన్నారు. యానిమల్ లవర్ కూడాను. జంతు సంరక్షణకు కృషి చేస్తున్నారు.