Allu Studios: ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు ఫామిలీ ఊపు ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అల్లు అరవింద్ స్థాపించిన ఆహా OTT మీడియా కి మిలియన్ల కొద్దీ సుస్క్రైబర్స్ ని సొంతం చేసుకొని జాతీయ స్థాయిలో టాప్ 5 OTT మీడియా లో ఒకటిగా నిలిచింది..మరో పక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా తో అంతర్జాతీయ స్థాయిలో ఏ రేంజ్ గుర్తింపుని సంపాదించుకున్నాడో మన అందరికి తెలిసిందే..ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం ప్రపంచం లో ఉన్న సినీ అభిమానులు మొత్తం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నారు..ఇలా ఈ కుటుంబ సభ్యులు ఏది తలపెట్టిన కూడా గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయి..ఆ ఉత్సాహం తోనే అల్లు అరవింద్ గారి కుమారులు ముగ్గురు అల్లు అర్జున్ , అల్లు శిరీష్ మరియు అల్లు బాబీ కలిసి హైదరాబాద్ లోని గండిపేట ప్రాంతం లో పది ఎకరాలను కొను గోలు చేసి అల్లు స్టూడియోస్ ని నిర్మించడానికి పూనుకున్నారు.

అత్యాధునిక టెక్నాలజీ తో హైదరాబాద్ లో ప్రస్తుతం టాప్ 3 ఫిలిం స్టూడియోస్ అయినా రామోజు ఫిలిం సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ ని తలదన్నేలా వంద కోట్ల భారీ వ్యయంతో అల్లు స్టూడియోస్ నిర్మాణానికి రెండేళ్ల క్రితమే శంకుస్థాపన చేసారు అల్లు ఫామిలీ..ఇప్పుడు ఈ స్టూడియోస్ కి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి అయ్యాయని..అక్టోబర్ 1 వ తేదీన అల్లు రామలింగయ్య గారి జయంతి ని పురస్కరించుకొని ఈ స్టూడియోస్ ని ఘనంగా ప్రారంబించబోతున్నారని..ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త..ఈ ప్రారంభ మహోత్సవానికి మెగా మరియు అల్లు కుటుంబ సభ్యులతో పాటుగా ఇండస్ట్రీ కి సంబంధించిన ప్రముఖ స్టార్ హీరోలు మరియు దర్శక నిర్మాతలు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది..ఈ స్టూడియోస్ లో సినిమాల షూటింగ్స్ దగ్గర నుండి..సీరియల్స్ షూటింగ్స్ వరుకు షూటింగ్స్ జరుపుకోవచ్చు అని.

ఆహా మీడియా కి సంబంధించిన షూటింగ్స్ అన్ని కూడా అల్లు స్టూడియోస్ లోనే జరగబోతున్నాయని సమాచారం..మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన ఈ స్టూడియోస్ హైదరాబాద్ లోనే టాప్ మోస్ట్ స్టూడియోస్ లో ఒకటిగా చేరుతుందా లేదా అనేది చూడాలి.