Allu Sirish Marriage: రాబోయే కొన్ని నెలల్లో అల్లు ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి అల్లు శిరీష్ ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలైతే చేయడం లేదు. గత సంవత్సరం ‘బడ్డీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన కొద్ది రోజులపాటు సినిమాలకు విరామం ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే వల్ల నాన్న అయిన అల్లు అరవింద్ నుంచి శిరీష్ కి పెళ్లి చెయ్యాలని అమ్మాయిలను వెతికే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఎట్టకేలకు శిరీష్ కోసం ఒక బిజినెస్ మ్యాన్ కూతురును సెలెక్ట్ చేశారట. ఇక శిరీష్ కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక కెరియర్ పరంగా పెద్దగా బిజీగా లేని అల్లు శిరీష్ పెళ్లి చేసుకొని తన లైఫ్ ను లీడ్ చేస్తూ బిజినెస్ కు సంబంధించిన పనులను చూసుకోవాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ పాన్ ఇండియాలో టాప్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలో వాళ్ళ అన్నయ్య సినిమాల్లో రాణిస్తుంటే శిరీష్ మాత్రం బిజినెస్ పనులను చూసుకుంటూనే సినిమా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నాడు.
ఇక దాంతో పాటుగా తొందర్లోనే ఆయన ఓ ఇంటి వాడు అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు…ఇక అన్ని కుదిరితే ఈ సంవత్సరం చివర్లో గాని, లేదంటే 2026 సమ్మర్లో గాని అల్లు శిరీష్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు… మొత్తానికైతే ఒక వైపు సినిమా లను చేస్తూనే పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నాడు. ఇక అల్లు శిరీష్ కి అన్ని ఉన్నప్పటికి ఒక్క విజయం మాత్రం దక్కడం లేదు.
సరైన సక్సెస్ పడితే ఆయన కూడా మంచి హీరోగా రాణిస్తాడు అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం ‘అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉంది’ అన్నట్టు చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు హీరోగా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే అల్లు శిరీష్ మాత్రం ఎన్ని సినిమాలు చేసిన ఒక సక్సెస్ ని కూడా సాధించలేకపోతున్నాడు…
మరి ఇప్పటికైనా మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే పెళ్లి చేసుకుంటే గాని అతనికి సక్సెస్ లు దక్కవనే ఉద్దేశ్యంతో వాళ్ళ నాన్న అతనికి పెళ్లి చేస్తున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం… మొత్తానికైతే ఆ బిజినెస్ మ్యాన్ కూతురును పెళ్లి చేసుకొని శిరీష్ సెటిల్ అవుతాడా? లేదా? అన్నది చూడాలి…