OG Interval Scenes: ఒక సినిమా సక్సెస్ లో దర్శకుడి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కథను రాసుకున్నప్పటి నుంచి దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేంతవరకు ప్రతి క్రాఫ్ట్ వాళ్ళతో వర్క్ చేయించుకోవాలి…ఇక డైరెక్టర్ ప్రతి సీన్ ను విజువల్ గా టాప్ లెవల్లో ఊహించుకొని దానికి తెర మీద ప్రాణం పోయాల్సి ఉంటుంది… ఎంటైర్ మూవీ మేకింగ్ ప్రాసెస్ లో ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగిన సినిమా మొత్తానికి మైనస్ అయ్యే అవకాశాలైతే ఉంటాయి. కాబట్టి దర్శకుడి విజన్ మీదే అందరు డిపెండ్ అయి వర్క్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓజీ’ సినిమా రీసెంట్ గా రిలీజై పెను ప్రభంజనాలను సృష్టిస్తోంది…పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇంతకు ముందెప్పుడు రానటువంటి కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తూ ఉండడం విశేషం… ‘ కంటెంట్ ఉన్నోడి కటౌట్ ఉంటే చాలు’ అని గబ్బర్ సింగ్ సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు ఓజీ సినిమాలో కథ పెద్దగా లేకపోయిన కూడా పవన్ కళ్యాణ్ ఆరా మీదనే ఈ సినిమా నడుస్తోంది… పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు సైతం ఈ సినిమాని రిపీటెడ్ గా చూస్తూ ఎంజాయ్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ హైలెట్ గా ఉంది. సుజీత్ పేపర్ మీద రాసుకున్న దానికంటే కూడా స్క్రీన్ మీద విజువల్ గా చాలా గొప్పగా ప్రజెంట్ చేశాడు… ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ ఇంటర్వెల్ సీన్ ఒక సినిమా నుంచి కాపీ చేశారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
‘సర్కార్ వారి పాట’ మూవీ ఫేమ్ పరుశురాం డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా చేసిన ‘యువత’ సినిమాలో హీరో ఫ్రెండ్ డైరెక్టర్ అవుదామని కొన్ని కథలు రాసుకుంటాడు. అందులో పవన్ కళ్యాణ్ కోసం ఒక కథ రాసానని అందులో ఇంటర్వెల్ సీన్ చాలా వైలెంట్ గా ఉంటుందని తన ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు.
తను ఏదైతే ఆ సినిమాలో చెప్పాడో అదే యాజ్ ఇట్ ఈజ్ సుజీత్ ఓజీ లో ఇంటర్వెల్ బ్యాంగ్ గా రాసుకొని తీశాడు. ప్రస్తుతం అది చూసిన ప్రతి ఒక్కరు సుజీత్ యువత సినిమాలో ఆ నటుడు చెప్పిన సన్నివేశాన్ని తీసుకొని దాన్ని స్క్రీన్ మీద చాలా వైల్డ్ గా ప్రజెంట్ చేశాడు. అయినప్పటికి ఈ సీన్ ను సుజీత్ కాపీ చేశాడు అంటూ కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం సుజీత్ కి సపోర్ట్ గా మాట్లాడుతూ పవర్ స్టార్ తో సినిమా తీయాలనుకునే ప్రతి ఒక్కరు ఇలాంటి సీన్స్ రాసుకుంటారని అది కేవలం యాదృచ్చికంగా కలిశాయి తప్ప కావాలని అలా చేయలేదంటూ ఇంకొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఫైనల్ గా ఈ సినిమాను సక్సెస్ ఫుల్ గా నిలిపిన సుజీత్ కి ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు గుడి కట్టేస్తాం అంటూ చాలా గొప్ప మాటలు చెబుతుండటం విశేషం…