Allu Sirish Engagement: అల్లు అర్జున్(Icon Star Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish) నిన్న నైనికా అనే అమ్మాయితో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ నిశ్చితార్దానికి సంబంధించిన ఫోటోలు,వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మెగా ఫ్యామిలీ లో ఒక్క పవన్ కళ్యాణ్ మినహా, మిగిలిన అందరూ ఈ వివాహ మహోత్సవానికి హాజరై అల్లు శిరీష్ ని ఆశీర్వదించారు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీ గా ఉండడం వల్ల ఆయన ఈ నిశ్చితార్ధ వేడుకకు హాజరు కాలేకపోయాడు. ఆయనకు బదులుగా సతీమణి అన్నా లెజినోవా, కూతురు పోలేనా ఈ నిశ్చితార్దానికి హాజరయ్యారు. పెద్దగా హంగులు, ఆర్భాటాలు లేకుండా చాలా సాధారణంగానే ఈ నిశ్చితార్దాన్ని జరిపించారు. సీఎం ఇండస్ట్రీ కి చెందిన వాళ్ళు పెద్దగా ఈ ఈవెంట్ కి హాజరు అవ్వలేదు. అల్లు అర్జున్ మరియు అల్లు శిరీష్ కి బాగా దగ్గరైన వాళ్ళు మాత్రమే ఈ వేడుకకు వచ్చారు.
Also Read: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను చనిపోకుండా కాపాడిన రవితేజ…కారణం ఏంటంటే..?
ఇదంతా పక్కన పెడితే ఇంతకీ ఈ నైనికా ఎవరు?, సినీ ఇండస్ట్రీ కి చెందిన అమ్మాయి యేనా?, లేదా బయట అమ్మయినా?, అల్లు శిరీష్ కి ఎలా పరిచయం?, వీళ్లది ప్రేమ వివాహమా?, లేకపోతే పెద్దలు కుదిరించిన వివాహమా?, అసలు ఆమె నేపథ్యం ఏంటి అని సోషల్ మీడియా లో తెగ వెతుకుతున్నారు నెటిజెన్స్. ఆమెకు సంబంధించిన వివరాలు పెద్దగా సోషల్ మీడియా లో లేవు కానీ, అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ఈమె తెలంగాణ అమ్మాయి, పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే అని తెలుస్తుంది. ఈమె తండ్రి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో అగ్రగామి, అంతే కాకుండా అనేక వ్యాపారాల్లో ఆరితేరిన వ్యక్తి. కోట్ల రూపాయిలు సంపాదించాడు. అల్లు ఫ్యామిలీ కి మొదటి నుండి మంచి సన్నిహితుడు. అల్లు శిరీష్ కి నైనికా ఆయన సినిమాల్లోకి రాక ముందు నుండే బాగా పరిచయం అట.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి వరకు తీసుకొచ్చింది. చూసేందుకు నైనికా నేటి తరం యంగ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోదు. ఇంత అందమైన అమ్మాయి దొరికినందుకు అల్లు శిరీష్ నిజంగా అదృష్టవంతుడు అనే చెప్పాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే చాలా రోజుల నుండి అల్లు శిరీష్ ప్రముఖ హీరోయిన్ అను ఇమ్మానుయేల్ తో ప్రేమలో ఉన్నట్టు, డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని ఈ దెబ్బతో తేలిపోయింది. ఇక అల్లు శిరీష్ పెళ్లి విషయానికి వస్తే వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలలో పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.