Chandrababu- KCR: ఫర్టీ ఈయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు చాదస్తం పెరిగిపోతోంది. ‘అప్పట్లో’ అన్న మాటను మరిచిపోలేకపోతున్నారు. నేనే సైబరాబాద్ కట్టాను. హైదరాబాద్ డెవలప్ మెంట్ నా హయాంలోనే జరిగింది. జంట నగరాలకు గుర్తింపు తెచ్చింది నేనే. పెట్టుబడులు తెచ్చింది నేనే. బిల్ క్లింటన్ నుంచి బిల్ గెట్స్ వరకూ అందరికీ సన్నిహితంగా మెలిగింది నేనే. అంటూ నోరు విప్పితే ఇవే మాటలు. అందునా తెలంగాణలో అడుగుపెట్టిన ప్రతీసారి ఇవే కామెంట్స్. ప్రజలకు బోరు కొడుతున్నాయి ఈ మాటలు. చంద్రబాబు నుంచి వారు కొత్త మాటలు కోరుకుంటున్నారు. కానీ చంద్రబాబుది అదే పాత వాణి. అయితే ఆయన చెప్పివని వాస్తవాలే. కానీ పదే పదే ఆయన గొప్పలను ఆయన చెప్పుకోవడంతోనే ప్రజల మధ్య చులకన అవుతున్నారు. అవి ప్రజల నుంచి రావాలి. చంద్రబాబు మాకు బాగా పాలించాడు అని ప్రజలు చెప్పుకోవాలి. కానీ పాడిందే పాట అన్నట్టు అన్నీ నేనే అంటూ చెప్పి సోషల్ మీడియాకు అడ్డంగా బుక్కవుతున్నారు.

తాజాగా కేసీఆర్ తన వారసుడే అంటూ సంచలన కామెంట్స్ చేశారు. నాడు తాను నాటిన ఫలాలను కేసీఆర్ దక్కించుకున్నాడని..వాటిని అనుభవిస్తున్నాడని చంద్రబాబు అర్ధం. నిజమే నాడు మంత్రి పదవి ఇచ్చుంటే టీఆర్ఎస్ అనేది పుట్టుకొని వచ్చుండేది కాదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యుండేవారు కాదు. నాడు మంత్రి పదవి ఇవ్వకపోవడమే నేటి కేసీఆర్ రాజకీయ ఉన్నతికి కారణమైంది. అది ముమ్మాటికీ చంద్రబాబు పుణ్యమే అని ఇప్పటికీ విశ్లేషిస్తుంటారు. కానీ అందులో మంచి అన్నది ఎవడికి అవసరం. అందుకే తనకు ఇబ్బందులు పెట్టిన చంద్రబాబునే బలవంతంగా తెలంగాణ నుంచి బయటకు నెట్టడంలో సక్సెస్ అయ్యారు కేసీఆర్. అసలు తెలంగాణలో టీడీపీ ఉనికి లేకుండా చేశారు. పార్టీ మూలాలను సైతం నాశనం చేశారు.

అయితే మొత్తం ఎపిసోడ్ లో పాత తరం రాజకీయాలు చెల్లవని గ్రహించిన చంద్రబాబు ఎప్పుడో 20 ఏళ్ల కిందట నేను అది చేశాను. నేను ఇది చేశాను అంటే తెలంగాణ ప్రజానీకం నమ్మే పొజిషన్ లో లేదు. ముందు చంద్రబాబు రియలైజ్ అవ్వాలి. తెలంగాణ ప్రజలకు ఎలాగైతే దగ్గర అవుతానో ఆలోచించాలి. పూర్వాశ్రమంలో పనిచేస్తున్న వారిని పిలిచి చేరదీయాలి. అప్పుడే తెలంగాణలో టీడీపీ యాక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశముంది. కానీ ఎప్పుడో రెండు దశాబ్దల కిందట చేసిన పనులు గుర్తించేటంత తీరిక ప్రజలకు లేదు. కొత్త జనరేషన్ కు అస్సలు అవసరం లేదు. తెలంగాణలో టీడీపీకి ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంక్ ను పొందాలంటే చంద్రబాబు సరికొత్తగా తయారుకావాలి. కానీ పాతపాటనే పాడితే మాత్రం వర్కవుట్ అయ్యే పరిస్థితులైతే తెలంగాణలో లేవు.