Upasana Sreemantham: మెగా, అల్లు కుటుంబాల మధ్య వివాదాలు నడుస్తూనే ఉన్నాయని ఇప్పటికీ అభిమానుల్లో చిన్నపాటి సందేహాలు ఉన్నాయి. కానీ మేమంతా ఒక్కటే అనే సందర్భాలు ఈమధ్య కాలం లోనే ఎన్నో చూశాము. కష్టసమయం వచ్చినప్పుడు కానీ, ఏదైనా సంబరాలు చేసుకునే సందర్భంలో కానీ, వీళ్లంతా కలిసిపోతారు. రీసెంట్ గా అల్లు అర్జున్ నాన్నమ్మ చనిపోయినప్పుడు మెగా కుటుంబం మొత్తం ఎలా ఆమె చివరి ప్రయాణం లో పాలు పంచుకున్నారో మనమంతా చూశాము. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, రీసెంట్ గానే ఉపాసన కు దీపావళి రోజున రెండవ సీమంతం జరిగింది కదా?, ఎందుకు అల్లు కుటుంబం ఈ వేడుకకు హాజరు కాలేదు?, కుటుంబం మొత్తానికి అతి ముఖ్యమైన సంబరం కదా?, ఈ గైర్హాజరు కి కారణం ఏమిటి?, చిరంజీవి పిలవలేదా?, లేకపోతే కావాలనే అల్లు ఫ్యామిలీ ఈ ఈవెంట్ ని మిస్ చేసిందా అని అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి.
కానీ అల్లు ఫ్యామిలీ ఈ సంబరం కి దూరంగా ఉండడానికి కారణం, ఆ కుటుంబం లో ఒక మనిషి చనిపోవడమే. అల్లు అర్జున్ నాన్నమ్మ చనిపోయి కనీసం రెండు నెలలు కూడా కాలేదు. కుటుంబం లో ఒక పెద్ద మనిషి చనిపోతే సంవత్సరం రోజుల వరకు ఎలాంటి సంబరం చేసుకోకూడదు. మన ఆచారాలను తూచా తప్పకుండ అనుసరించే వాళ్ళు పాటించే నియమం ఇది. అందుకే అల్లు ఫ్యామిలీ ఈ సీమంతం వేడుకకు రాలేదని తెలుస్తుంది. కానీ ఇంత మంచి వేడుక లో తమ అభిమాన హీరో ని చూడలేకపోయామే అనే బాధ అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో అలాగే ఉండిపోయింది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ కూడా హాజరు అవ్వలేదు. ఆయనకు బదులుగా సతీమణి అన్నా లెజినోవా, కూతురు పోలేనా హాజరయ్యారు. వరుణ్ తేజ్ కూడా తన బిడ్డతో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం మనమంతా చూశాము. ఇక ఇండస్ట్రీ నుండి అక్కినేని నాగార్జున దంపతులు, విక్టరీ వెంకటేష్ దంపతులు కూడా హాజరయ్యారు.