Bigg Boss 9 Telugu Ayesha: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన వారిలో లేడీ టైగర్ అనిపించుకున్న కంటెస్టెంట్ అయేషా. మొదటి వారం ఈమె హౌస్ లోకి అడుగుపెట్టిన వెంటనే తనూజ ని సరైన పాయింట్స్ తో నామినేట్ చేసి దడలాడించడంతో కచ్చితంగా ఈమె తనూజ కి పోటీ అవుతుందని అనుకున్నారు. కానీ హౌస్ లో ఎక్కువ శాతం ఈమె గొడవలకు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. టాస్కులు ఆడేందుకు ఈ వారం ఆమెకు మంచి స్కోప్ దక్కింది కానీ, ఆమె తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. మెడికల్ టెస్టులు చేశారు, బయటకు తీసుకెళ్లి చెకప్ కూడా చేయించారు. ఈమెకు టైఫాయిడ్ సోకిందేమో అనే అనుమానం వైద్యులకు కలిగింది. అందుకు అనుగుణంగా శాంపిల్స్ ని తీసుకొని టెస్ట్ చేయగా, నిజంగానే ఆమెకు టైఫాయిడ్ అని తేలింది. దీంతో ఆమెని హౌస్ నుండి బయటకు పంపేశారు.
టైఫాయిడ్ వ్యాప్తి చెందే జ్వరం కాబట్టి, హౌస్ మేట్స్ కి కూడా సోకిందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే కంటెస్టెంట్స్ ఆరోగ్యం ప్రస్తుతానికి సరిగా లేదు. ముఖ్యంగా తనూజ టాస్క్ ఆడిన తర్వాత స్పృహ కోల్పోయి క్రింద పడిపోవడం మనమంతా రెండవ ప్రోమో లో చూసాము. ఇదంతా సీరియల్ యాక్టింగ్ అంటూ ఆమెని నెటిజెన్స్ వెక్కిరించారు కానీ, ఆమెకు నిజంగా తీవ్రమైన అస్వస్థత ఏర్పడింది అట. కోల్డ్ తో ఇబ్బంది పడుతున్న తనూజ గేమ్ లో ఇంకా ఎక్కువ ఒత్తిడికి గురవ్వడం తో ఇలా స్పృహ కోల్పోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకైనా మంచిది కంటెస్టెంట్స్ అందరికీ టెస్టింగ్ చేయిస్తే బాగుంటుంది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ సలహా ఇస్తున్నారు. ఒకవేళ అయేషా కి సోకిన టైఫాయిడ్ హౌస్ మేట్స్ అందరికీ సోకి ఉండుంటే ఈ సీజన్ రద్దు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. చూడాలి మరి ఏమి జరగబోతోంది అనేది.