SS Rajamouli- Allu Aravind: మగధీర.. 40 కోట్ల బడ్జెట్ తో 80 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన సినిమా. 2009లోనే ఒక తెలుగు సినిమాకి ఈ స్థాయి కలెక్షన్లు వచ్చాయా ? అని బాలీవుడ్ సైతం బిత్తరపోయేలా చేసిన సినిమా మగధీర. రాజమౌళి కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లిన మొదటి సినిమా కూడా మగధీరనే. అప్పట్లో యావత్ తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఓ సమ్మోహనాస్త్రం.
అందుకే.. అప్పుడు మగధీర క్రియేట్ చేసిన రికార్డుల్లో ఇప్పటకీ కొన్ని ఇంకా చెక్కు చెదర్లేదు. ఈ సినిమా తర్వాతే.. రాజమౌళిలో కొత్త ఉత్సాహం వచ్చింది. వినూత్న నేపథ్యాలు తీసుకుని భారీ చిత్రాలు తీయడం జక్కన్న ఈ చిత్రంతోనే మొదలు పెట్టాడు. అయితే ఈ చిత్రం క్రెడిట్ విషయంలో దర్శకుడు రాజమౌళికి, నిర్మాత అల్లు అరవింద్ కు మధ్య కొంత గ్యాప్ వచ్చింది.
Also Read: Rashmi Gautam: రష్మీని ఫిలిం ఛాంబర్ గేటుకు కట్టేసి కొడతానన్న నిర్మాత.. ఆ పని చేసిందట..
ఆ గ్యాప్ కి కారణం.. ఈ చిత్రం విజయాన్ని పూర్తిగా సొంతం చేసుకోవడం కోసం అల్లు అరవింద్ క్రమక్రమంగా రాజమౌళిని సైడ్ చేశాడు అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే అరవింద్ – రాజమౌళి మధ్య గ్యాప్ కు కారణం ఇది కాదు అని, మరో కారణం ఉందని.. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రాజమౌళినే ఓపెన్ అయ్యాడు. అప్పట్లో ఒక సినిమా హిట్ అయితే.. 50 రోజులు, 100 రోజులు, 175 రోజులు అంటూ థియేటర్ల సెంటర్ల విషయంలో ఎక్కువుగా ఫేక్ రికార్డులను అభిమానుల కోసం చూపించాల్సి వచ్చేది.
మగధీర విషయంలో ఇలాంటి ఫేక్ రికార్డులను అస్సలు ప్రమోట్ చేయకూడదు అంటూ రాజమౌళి ముందే అల్లు అరవింద్ కి చెప్పారు. అరవింద్ కూడా రాజమౌళి ప్రపోజల్ కి ఓకే చెప్పారు. కానీ, తీరా సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాక, రాజమౌళికి ఇచ్చిన మాటను అరవింద్ తప్పారు. పైగా కొన్ని విషయాల్లో రాజమౌళిని పక్కన పెట్టి మరీ.. 50 – 100 – 175 రోజులు అంటూ అన్ని కోట్లు ఇన్ని కోట్లు అంటూ ఫేక్ రికార్డులు బయటకు వదిలారు.
దీంతో రాజమౌళి బాగా హర్ట్ అయ్యాడు. పైగా ఈ చిత్రాన్ని తమిళంలో కూడా రిలీజ్ చేయమని రాజమౌళి, అరవింద్ పై ఎంత ఒత్తిడి పెంచినా.. అరవింద్ మాత్రం సినిమాని తమిళంలో వెంటనే రిలీజ్ చేయలేదు. తెలుగు ప్రమోషన్లలో బిజీ కావడం కారణంగానే.. మగధీర తమిళంలో వెంటనే రిలీజ్ కాలేకపోయింది. ఈ రెండు కారణాలతో రాజమౌళి- అరవింద్ మధ్య గ్యాప్ పెరిగింది. నిజానికి అప్పటి నుంచే రాజమౌళిలో చాలా మార్పు వచ్చింది.
Also Read: Shahrukh Khan OTT Platform: ‘కింగ్ ఖాన్.. ఓటీటీ సామ్రాజ్యాన్ని ఏలబోతున్నాడు !