Hero Naresh First Marriage: యాక్షన్, మాస్ హీరోలు రాజ్యమేలుతున్న రోజుల్లో కామెడీ చిత్రాలతో తెలుగు తెరపై నవ్వులు విరబూయించేలా చేసిన నాటి హీరోలు ఇద్దరే. వారిలో ఒకరు రాజేంద్రప్రసాద్ కాగా.. రెండో వ్యక్తి నరేశ్. ఈ ఇద్దరూ కూడా తమదైన కామెడీ సినిమాలతో అలరించారు. 1980వ దశకంలో యాక్షన్ సినిమాలు నడస్తున్న టైంలో జంధ్యాల రేలంగి నరసింహారావు వంటి దర్శకుల చిత్రాలతో వీరు కామెడీని పండించి కామెడీ హాస్యనటులుగా ఎదిగారు.
ముఖ్యంగా నరేశ్ అప్పట్లో చేసిన చిత్రాలన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. 1970లో ‘రెండు కుటుంబాల కథ’, 1972లో ‘పండంటి కాపురం’ చిత్రాలతో బాలనటుడిగా నరేశ్ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తల్లి విజయనిర్మల దర్శకత్వంలో 1982లో ప్రేమ సంకెళ్లు అనే చిత్రంలో హీరోగా నటించారు. ఆ తర్వాత ‘నాలుగు స్తంభాలాట’, రెండె జడల సీత, శ్రీవారికి ప్రేమలేఖ, చూపులు కలిసిన శుభవేళ, హైహై నాయక, జస్టిస్ రుద్రమదేవి, కోకిల వంటి సినిమాలు తీశాడు.
Also Read: Sudheer- Rashmi: అది ఇవ్వాలా అని సుధీర్‌ను అడిగిన రష్మీ.. సరసాలు ఎక్కువయ్యాయంటూ..
ఈ క్రమంలోనే రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం భళారే విచిత్రం’ సినిమా నరేశ్ కెరీర్లోనే బిగ్ హిట్ ఇచ్చి మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక 1993లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘జంబలకిడి పంబ’ సినిమా నరేశ్ సీనీ జీవితంలోనే బ్లాక్ బస్టర్ హిట్ గా మంచి విజయాన్ని సాధించింది.
ఇక నరేశ్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన మొదట సీనియర్ కెమెరామెన్ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ నవీన్ అనే కుమారుడు జన్మించాడు. కొన్ని మనస్పర్తలతో ఈ జంట విడిపోయింది. తర్వాత రెండో పెళ్లి చేసుకున్నా కూడా అది కూడా విడాకుల వరకూ వెళ్లింది. తర్వాత నరేశ్ 50 ఏళ్ల వయసులో సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె అయిన రమ్యను 2010లో హిందూపురంలో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈమెతోనూ విభేదాలు వచ్చినట్టు ఇటీవల మీడియా వార్తల ద్వారా తెలిసింది.
Also Read: Sajjanar Tweet About RRR: ఎత్తరజెండా పాటను కూడా వదలని సజ్జనార్.. ఇలా వాడేశాడే