Prabhas Project-K: నేషనల్ స్టార్ ప్రభాస్ – యంగ్ క్రేజీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ల కలయికలో రానున్న ‘ప్రాజెక్ట్ కే’ సినిమా పై ఒక లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ చిత్ర నిర్మాత సి అశ్వనీ దత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అప్‌డేట్స్ ను చెప్పారు. సి అశ్వనీ దత్ మాటల్లోనే.. ‘అవును, మా సినిమా ఇప్పటికే రెండు కీలకమైన షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ఇక పరిస్థితులన్నీ సహకరిస్తే ఈ నెలాఖర్లో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేస్తాము.

పైగా ఇప్పుడు స్టార్ట్ చేయబోయే షెడ్యూల్ లో అమితాబ్, దీపికా ల కూడా పాల్గొనబోతున్నారు. ఇక సినిమా రిలీజ్ విషయానికి వస్తే.. వచ్చే ఏడాది ఉంటుంది. అది కూడా అన్నీ అనుకున్నట్టు పూర్తైతేనే. వచ్చే ఏడాది అంటే.. వచ్చే ఏడాది వేసవిలో. ఒక్కటి మాత్రం స్పష్టం చేస్తున్నాను. మా చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తాం’ అని అశ్వనీ దత్ చెప్పుకొచ్చాడు.
Also Read: స్పిరిట్ మూవీ లో ప్రభాస్ రోల్ ఏంటో తెలిసిపోయిందోచ్… సీక్రెట్ రివీల్ చేసిన నిర్మాత ఎవరంటే ?
నిజంగానే నాగ్ అశ్విన్ ఈ సినిమా మేకింగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. మెయిన్ గా తెలుగు సినిమా చరిత్రలో ఇంతవరకూ ఎన్నడూ చూడని నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించడానికి నాగ్ అశ్విన్ చాలా కొత్తగా కథను రాసుకున్నాడట. మరి ఆ నేపథ్యం ఏమిటో చూడాలి. అయితే, సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందని.. అందుకే ఆ జోనర్ లో అనుభవం ఉన్న సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును స్క్రీన్‌ప్లే పర్యవేక్షకుడిగా పెట్టుకున్నారని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.
Also Read: ‘బంగార్రాజు’ను పట్టుకున్న బెంగ..!
[…] Also Read: ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’ పై ఇంట్రెస్… […]
[…] Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, అలాగే అకీరా నందన్ కూడా కరోనా బారిన పడ్డారు. తమకు కోవిడ్ -19 పాజిటివ్ అని తాజాగా రేణూ దేశాయ్ తెలియజేసింది. వాస్తవానికి తమకు గత కొన్ని రోజుల కితమే కరోనా పాజిటివ్ అని, ప్రస్తుతం తాము పూర్తిగా కోలుకుంటున్నాం అని రేణు తెలిపింది. ఇక ఆమె మెసేజ్ చేస్తూ.. తాను ఆల్రెడీ రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నాను అని, అయినప్పటికీ నాకు కరోనా పాజిటివ్ వచ్చింది అని ఆమె చెప్పింది. […]